|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రియల్‌ లవ్‌ స్టోరీ: థియేటర్లలో రికార్డు కలెక్షన్లు, ఓటీటీలో 100 మిలియన్ల నిమిషాలతో అదరగొట్టిన సినిమా!

Published: 30-12-2025, 11:50 AM
రియల్‌ లవ్‌ స్టోరీ: థియేటర్లలో రికార్డు కలెక్షన్లు, ఓటీటీలో 100 మిలియన్ల నిమిషాలతో అదరగొట్టిన సినిమా!
  • `రాజు వెడ్స్ రాంబాయి` థియేటర్లలో రూ. 20 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
  • ఈ చిత్రం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతూ ఓటీటీలో దూసుకుపోతోంది.
  • ఓటీటీలో ఇప్పటికే 100 మిలియన్స్ వ్యూస్ మినిట్స్ మార్క్‌ను దాటింది.
  • తెలంగాణలో జరిగిన రియలిస్టిక్ పరువు హత్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో, ఓటీటీలోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన `రాజు వెడ్స్ రాంబాయి` చిత్రం థియేటర్లలో రూ. 20 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో 100 మిలియన్ల నిమిషాలతో దుమ్మురేపుతూ ట్రెండింగ్‌లో ఉంది.

థియేటర్లలో `రాజు వెడ్స్ రాంబాయి` సంచలనం

ఇటీవల కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలో బాగా ఆడుతున్నాయి. కొన్ని మూవీస్‌ రెండు చోట్ల గట్టిగానే రచ్చ చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియెన్స్ ముందుకు వచ్చిన `రాజు వెడ్స్ రాంబాయి` థియేటర్లలో విశేష ఆదరణ పొందింది. బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.

కొత్త  నటీనటులు అఖిల్‌ రాజ్‌, తేజస్విని రావ్‌ జంటగా నటించిన `రాజు వెడ్స్ రాంబాయి` చిత్రంలో శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనితా చౌదరీ ప్రధాన పాత్రలు పోషించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఆయనకిది తొలి చిత్రం. ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. ఈటీవీ విన్‌ సమర్పణలో రూపొందిన ఈ మూవీని  నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాసు థియేటర్లలో గత నెలలో విడుదల చేశారు.

ఓటీటీలో 100 మిలియన్ల వ్యూస్ మినిట్స్

తెలంగాణలో జరిగిన ఒక రియలిస్టిక్‌ లవ్‌ స్టోరీతో దీన్ని రూపొందించారు. పరువు హత్యల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. దీంతో యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. క్రిటిక్స్ ప్రశంసించారు. దీంతో చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ. 20కోట్లు రాబట్టింది. ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతుంది.

పరువు హత్యల నేపథ్యంలో రియలిస్టిక్ ప్రేమకథ

`రాజు వెడ్స్ రాంబాయి` మూవీ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. గత వారం నుంచే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. టాప్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్‌ మినిట్స్ ని దాటేయడం విశేషం. ఇంకా టాప్‌లోనే రాణిస్తూ సరికొత్త సంచలనాల దిశగా స్ట్రీమింగ్‌ అవుతుండటం విశేషం.

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన `రాజు వెడ్స్ రాంబాయి` థియేటర్ల వద్ద, ఓటీటీలోనూ అద్భుతమైన విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల ఆదరణ, విమర్శకుల ప్రశంసలతో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.