
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మద్దతుగా దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్‌పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సల్మాన్‌ను దేవుడు అంటూ, అతన్ని ఏమైనా అంటే చెప్పుతో కొడతానని ఘాటుగా హెచ్చరించింది.
Key Points
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సల్మాన్ ఖాన్‌ను 'దేవుడు' అంటూ, ఆయన్ని ఏమైనా అంటే చెప్పుతో కొడతానని ఘాటుగా హెచ్చరించింది.
అభినవ్, సల్మాన్‌ను బాడీ షేమ్ చేయడం, అతని ఆరోగ్యాన్ని ఎగతాళి చేశాడని రాఖీ ఆరోపణలు చేసింది.
బిగ్ బాస్ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో అభినవ్ చేసిన ఆరోపణలపై సల్మాన్ ఖాన్ స్పష్టత ఇచ్చారు.
రాఖీ సావంత్ ఆగ్రహం: అభినవ్‌పై ఎందుకు?
బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ పై ఫైర్ అయింది. చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలతో కలకలం రేపింది. సల్మాన్ ఖాన్ కు సపోర్ట్ గా రాఖీ ఈ కామెంట్లు చేసింది.
బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ ను ఉద్దేశించి కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ తో గొడవ తరచూ వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు మద్దతుగా చిత్రనిర్మాత అభినవ్ పై రాఖీ సావంత్ విరుచుకుపడింది.
సల్మాన్‌కు రాఖీ మద్దతు: చెప్పుతో కొడతా బెదిరింపు
అభినవ్ సల్మాన్ ను బాడీ షేమ్ చేయడం, అతని ఆరోగ్యాన్ని ఎగతాళి చేయడం, నీచమైన ఆరోపణలు చేశారని రాఖీ ఆరోపించింది. అభినవ్ ను కలిస్తే అతనిపై 10 గుడ్లు కొడతానని రాఖీ సావంత్ తెలిపింది. అభినవ్ ను సీరియస్ గా తీసుకోవద్దని సల్మాన్ కు రాఖీ మెసేజ్ కూడా ఇచ్చింది.
అభినవ్ ఆరోపణలు – సల్మాన్ స్పందన
ఇటీవలే బిగ్ బాస్ 19 వీకెండ్ కా వార్ ఎపిసోడ్ లో అభినవ్ చేసిన ఆరోపణలపై సల్మాన్ స్పష్టం చేశారు. “నన్ను ఎక్కువగా బాధించే విషయం ఏమిటంటే, మీరు మిమ్మల్ని నాశనం చేసుకుంటున్నారు. మీరు ఎవరినైనా వెంబడించాలనుకుంటే, దయచేసి మీ కుటుంబం లేదా మీ సోదరుడు (అనురాగ్ కశ్యప్) వెంట వెళ్ళండి. లేదా, మీ సోదరుడిని, మీ తల్లిదండ్రులను, మీ భార్యను ప్రేమించండి. మీరు చేయగలిగేది అదే” అని చెప్పాడు.
సల్మాన్ ఖాన్, అభినవ్ కశ్యప్ మధ్య వివాదం కొనసాగుతుండగా, రాఖీ సావంత్ ఎంట్రీ మరింత వేడిని రాజేసింది. ఈ కామెంట్లు బాలీవుడ్ లో చర్చకు దారితీస్తున్నాయి. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.


