|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అందంగా కనిపించడానికి పక్కటెముకలు విరగొట్టుకుంటున్నారు.. ఊర్వశీపై రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్

Published: 11-11-2025, 2:59 AM
అందంగా కనిపించడానికి పక్కటెముకలు విరగొట్టుకుంటున్నారు.. ఊర్వశీపై రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వివాదంలో నిలిచింది. నటి ఊర్వశి రౌటేలా అందంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. సన్నగా కనిపించడానికి పక్కటెముకలు విరగొట్టుకోవడం కొత్త ట్రెండ్ అని, ఊర్వశి సహజ సౌందర్యం గురించి అబద్ధాలు చెబుతోందని రాఖీ మండిపడింది. ఈ వార్త సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది.

Key Points

1

రాఖీ సావంత్ బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా అందంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

2

సన్నగా కనిపించడానికి పక్కటెముకలు తొలగించుకునే కొత్త ట్రెండ్‌ను రాఖీ ప్రస్తావించింది.

4

రాఖీ సావంత్ తన రీఎంట్రీ కోసం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Sawant) నిత్యం పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్‌లోనూ రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా, రాఖీసావంత్ హీరోయిన్ ఊర్వశి అందంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela)మౌంటేన్ గర్ల్‌ను నేచురల్ బ్యూటీని అని చెప్పడంపై మండిపడింది. ‘‘ఊర్వశీ మేము నీ పాత ఫొటోలను చూశాం. ఈ రోజుల్లో చాలా మంది సన్నగా కనిపించడానికి తమ పక్కటెముకలు విరగొట్టుకుంటున్నారు. ఇది కొత్త ట్రెండ్‌గా మారింది. కొన్ని దేశాల్లో ఇలా సర్జరీలు చేయించుకుంటున్నారు.

నడుము సన్నగా కనిపించాలంటే రిబ్స్ తొలగించుకుంటున్నారు. అందులో తప్పేమి లేదు కానీ నువ్వు సహజంగా ఇలా ఉన్నాను అని అబద్ధం చెప్పకు. మేము నిన్ను మొదట చూసినప్పుడు నువ్వు ఇంతలా లేవు. ఇప్పుడు ఎంత మారిపోయావో అందరికీ తెలుసు. దయచేసి నేచురల్ బ్యూటీని అని చెప్తూ అతి చేయకు. లుక్ మార్చుకుంటే తప్పులేదు.. కానీ సహస సౌందర్యం అనడం తప్పు’’ అని కౌంటర్లు వేసింది. కాగా.. గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాఖీ సావంత్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే పలు నటీనటులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఊర్వశి రౌటేలాపై కౌంటర్లు

సన్నని నడుము కోసం సర్జరీలు

రాఖీ సావంత్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సన్నని నడుము కోసం సర్జరీలు చేయించుకుంటున్న నటీమణులపై ఆమె పరోక్షంగా సెటైర్లు వేసింది. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.