
📌 Key Points
- రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది.
- నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
- ఇటీవల బేబీ పింక్ లెహంగాలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
- ఆమె ఎలిగెంట్ లుక్‌కు నెటిజన్లు ‘గార్జియస్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన బేబీ పింక్ లెహంగా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ఎలిగెంట్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రకుల్ ప్రీత్ సింగ్ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం
‘ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.
ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
ఇన్‌స్టాలో రకుల్ బేబీ పింక్ లెహంగా అందాలు
ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బేబీ పింక్ కలర్ లెహంగాలో బుట్టబొమ్మలా రెడీ అయింది. జుట్టు విరబోసుకొని, ఎలిగెంట్ లుక్‌లో సూపర్ క్యూట్ అనిపించింది. ఇక ఈ పిక్స్‌కు ‘హలో, నూతన సంవత్సరం. దయతో, ప్రశాంతంగా మరియు గులాబీ రంగులో ఉందాం’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రకుల్ అందాలకు ఫిదా అయిన నెటిజన్లు
A post shared by Rakul Singh (@rakulpreet)
మొత్తంగా, రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో, స్టైల్‌తో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, టాలీవుడ్ ప్రేక్షకులతో ఆమె కనెక్షన్ చెక్కుచెదరలేదని ఈ వైరల్ పోస్ట్ నిరూపించింది.


