
టాలీవుడ్‌లో సత్తా చాటిన నటి రకుల్ ప్రీత్ సింగ్, తన సినిమా జీవితం, వివాహం తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతూ, తాజాగా ప్రకృతి ప్రాముఖ్యతను గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Key Points
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా పరిశ్రమలో సత్తా చాటింది.
సీనియర్ హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ప్రకృతితో అనుబంధాన్ని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జాకీ భగ్నానీని వివాహం చేసుకున్నప్పటికీ సినిమాల్లో కొనసాగుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ యొక్క టాలీవుడ్ జర్నీ
నటి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఏకంగా సీనియర్ ప్రముఖ హీరోయిన్లు సైతం చెమటలు పట్టిస్తూ.. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. సీనియర్ హీరోల సరసన అవకాశం కొట్టేసి.. తనదైన అందం, నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో ఓ స్థానం సంపాదించుకుంది.
అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ దక్కించుకున్న ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టింది. హీరో సందీప్ కిషన్ సరసన నటించి.. నెటిజన్ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తర్వాత రఫ్ సినిమాలో నటించింది. స్టార్టింగ్‌లో చిన్న హీరోలతో నటించి.. మంచి పేరు దక్కించుకుంది. తర్వాత సీనియర్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది.
ప్రకృతిపై రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం
సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని వంటి సీనియర్ కథానాయకుల సరసన చాన్స్‌లు కొట్టేసి.. మరింత ఫేమ్ తెచ్చుకుంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీని ప్రేమించి.. వివాహం చేసుకున్న విషయం తెలిసింది.
అయినప్పటికీ ఈ హీరోయిన్ ఇటు మ్యారేజ్ లైఫ్‌ను.. అటు సినిమాల్లో నటిస్తూ లైఫ్ లీడ్ చేస్తుంది. తాజాగా రకుల్ సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ‘‘ప్రకృతితో పొత్తు పెట్టుకోండి. ప్రక్రియను విశ్వసించండి.. ఎదగండి’’ అని పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే ‘‘ప్రకృతి ధైర్యాన్ని ప్రేమిస్తుంది. మీరు నిబద్ధత చూపుతారు. ప్రకృతి అసాధ్యమైన అడ్డంకులను తొలగించడం ద్వారా ఆ నిబద్ధతకు ప్రతిస్పందిస్తుంది. అసాధ్యమైన కలను కలలు కనండి. ప్రపంచం మిమ్మల్ని అణచివేయదు. అది మిమ్మల్ని పైకి లేపుతుంది’’. అంటూ పోస్టులో టెర్రెన్స్ మెక్కెన్నా చెప్పిన మంచి మాటను పోస్టులో జోడించింది.
రకుల్ ప్రీత్ సింగ్ యొక్క వృత్తి జీవితం మరియు వ్యక్తిగత జీవితం
A post shared by Rakul Singh (@rakulpreet)
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సమతుల్యతను కాపాడుకుంటూ, ప్రకృతి సహవాసం గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ఆమె సక్సెస్‌ఫుల్ జర్నీ ప్రేరణదాయకం.


