
📌 Key Points
- రకుల్ ప్రీత్ సింగ్: టాలీవుడ్ టు బాలీవుడ్ జర్నీలో సంచలన వ్యాఖ్యలు!
- పవన్ కళ్యాణ్ రాక్ స్టార్ అంటూ రకుల్ చేసిన ట్వీట్ వైరల్!
- గబ్బర్ సింగ్ సినిమా దబాంగ్ కంటే బెస్ట్ అని రకుల్ కామెంట్స్.
- పవన్ ఫ్యాన్స్ సంబరాలు.. రకుల్ ట్వీట్ ట్రెండింగ్!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక సంచలన ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ట్వీట్ ఏమిటో చూసేద్దాం!
రకుల్ ప్రీత్ సింగ్ సంచలన ట్వీట్ వైరల్!
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.
పవన్ కళ్యాణ్ పై రకుల్ కామెంట్స్
ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
గబ్బర్ సింగ్ గొప్పతనం చెప్పిన రకుల్
అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో(2013లో) రకుల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ట్వీట్‌లో ఈ చిన్నది.. ‘ఒక పంజాబిని అయిన నాకు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా కంటే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన గబ్బర్ సింగ్ మూవీ నచ్చింది.. పవన్ కళ్యాణ్ నిజంగా రాక్ స్టార్’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ ట్వీట్‌ను ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరి మీరు కూడా గతంలో ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్‌ను చూసేయండి.
రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


