|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రకుల్ సంచలన వ్యాఖ్యలు: మోసం చేస్తే ఊరుకోనని వార్నింగ్! నెట్టింట దుమారం!

Published: 20-05-2026, 4:45 AM
రకుల్ సంచలన వ్యాఖ్యలు: మోసం చేస్తే ఊరుకోనని వార్నింగ్! నెట్టింట దుమారం!
  • రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
  • మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని రకుల్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది.
  • జాకీ భగ్నానీతో రిలేషన్‌షిప్‌పై పుకార్లకు రకుల్ చెక్ పెట్టింది.
  • సారా అలీ ఖాన్ కామెంట్స్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. రిలేషన్‌షిప్‌లలో మోసం గురించి ఆమె బోల్డ్ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె మాటలు ఎలాంటి దుమారం రేపుతున్నాయో చూద్దాం!

రకుల్ స్ట్రైట్ టాక్: మోసంపై స్పష్టత!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, జాకీ భగ్నానీ వైవాహిక జీవితం గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో జాకీ తమ రిలేషన్‌షిప్‌ను సిట్యుయేషన్‌షిప్‌గా పిలవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. దీంతో పలు పుకార్లు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే రకుల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి.. పుకార్లు చెక్ పెట్టింది. దీంతో అంతా సర్దుమనిగింది అనుకనే లోపే రకుల్ రిలేషన్‌షిప్‌లో మోసం చేస్తే క్షమించకూడదని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా విడుదలైన ‘పతి పత్ని ఔర్ వో 2’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానాలతో కలిసి ‘ది బాంబే జర్నీ’ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంధాలలో నమ్మకద్రోహం గురించి చర్చ వచ్చింది.

రిలేషన్‌షిప్‌లో మోసం చేయడాన్ని అస్సలు అంగీకరించలేమని రకుల్ చెప్పింది. అయితే, చర్చ ముందుకు సాగుతున్నప్పుడు రకుల్ ఒక భిన్నమైన అభిప్రాయాన్ని పంచుకుంది. “జీవితం చాలా పెద్దది. ఎవరైనా పొరపాటున ఒక్కసారి ఆ తప్పు చేసి, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబితే క్షమించవచ్చు. కానీ, మోసం చేయడమే ఒక అలవాటుగా మారితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అస్సలు క్షమించకూడదు. ఇది కేవలం నా సాధారణ అభిప్రాయం మాత్రమే, నా వ్యక్తిగత జీవితానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఇది నా భర్తకు కూడా వర్తించదు. దయచేసి తప్పుడు వార్తలు సృష్టించకండి” అని రకుల్ స్పష్టం చేసింది. గతంలో తన భర్త చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్లే తన అభిప్రాయంపై కూడా పుకార్లు సృష్టింస్తారని భావించిన రకుల్ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. ఇక దీనిపై సారా అలీ ఖాన్ స్పందిస్తూ.. తాను క్షమించగలనేమో కానీ, ఆ తప్పును ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న సారా అలీ ఖాన్ రియాక్షన్!

నెటిజన్ల మధ్య మాటల యుద్ధం!

రకుల్ వ్యాఖ్యలు, దానిపై స్పందనలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.