|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Charan: చరణ్ కి అరుదైన గౌరవం.. తొలి నటుడిగా ఘనత

Published: 12-05-2025, 10:15 AM
Ram Charan: చరణ్ కి అరుదైన గౌరవం.. తొలి నటుడిగా ఘనత

మెగాస్టార్ రామ్ చరణ్ లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేయబడిన తొలి భారతీయ నటుడి విగ్రహం కావడం విశేషం.

Key Points

1

రామ్ చరణ్ లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు.

2

మేడమ్ టుస్సాడ్స్ లో తొలి భారతీయ నటుడి విగ్రహం చరణ్ విగ్రహం.

4

ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు.

లండన్ లో మేడమ్ టుస్సాడ్స్ ఘనత

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ జరగ్గా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన చరణ్.. మే 10న విగ్రహాన్ని ఆవిష్కరించాడు.

తొలి భారతీయ నటుడిగా చరణ్

కొన్నాళ్ల క్రితం మ్యూజియం నిర్వహకులు స్వయంగా హైదరాబాద్ వచ్చి చరణ్ కొలతలు తీసుకుని వెళ్లారు. మైనపు విగ్రహంలో చరణ్ తోపాటు అతడి పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. అలానే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం. తద్వారా చరణ్ అరుదైన ఘనత సాధించాడు.

గతంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ లో, అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని.. మేడమ్ టుస్సాడ్స్ దుబాయి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఈ గౌరవం దక్కింది. చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఇది థియేటర్లలోకి రానుంది.

పెద్ది సినిమా అప్డేట్

మొత్తానికి, రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం లభించడం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఆయన సొంతం కావాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.