
📌 Key Points
- రామ్ చరణ్ కంటి సర్జరీ తర్వాత ‘పెద్ది’ షూటింగ్‌లో ప్రత్యక్షం, అభిమానులతో సెల్ఫీ!
- మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీజర్ విడుదల!
- టీజర్ విడుదల సమయం ఉదయం 11:07 నుండి ఉదయం 9:45కి మార్పు!
- ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త. రామ్ చరణ్ కంటి సర్జరీ తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడం, ‘పెద్ది’ టీజర్ విడుదల కానుండటం విశేషం.
కంటి గాయం తర్వాత షూటింగ్‌లో రామ్ చరణ్ సందడి!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడ్డ సంగతి తెలిసిందే. కంటి వద్ద రాంచరణ్ కి ప్రమాదవశాత్తూ గాయం అయింది. అయితే అది భయపడాల్సినంత పెద్ద గాయం కాదు. అయినప్పటికీ వైద్యులు రాంచరణ్ కంటికి చిన్న సర్జరీ చేశారు. దీనితో అభిమానులు ఆందోళన చెందారు. ఆందోళన చెందాల్సినంత పెద్ద గాయం, సర్జరీ కాదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
చిరంజీవి కూడా చరణ్ కంటికి సర్జరీ చేసిన వైద్యుడు డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గాయం వల్ల పెద్ది సినిమాపై ఎలాంటి ప్రభావం ఉండదని,, త్వరలోనే చరణ్ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ ప్రకటించింది. చెప్పినట్లుగానే నేడు రాంచరణ్ పెద్ది షూటింగ్ లొకేషన్ లో సందడి చేశారు.
కంటి సర్జరీ తర్వాత రాంచరణ్ బయటకి రావడం ఇదే తొలిసారి. షూటింగ్ లొకేషన్ లో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులతో రాంచరణ్ సెల్ఫీ తీసుకున్నారు. శుక్రవారం రోజు రాంచరణ్ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. దీనితో గురువారం సాయంత్రం నుంచే అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు.
‘పెద్ది’ టీజర్ రిలీజ్ టైమ్ మారింది!
♥️♥️♥️ pic.twitter.com/vOURPGFigL
— SivaCherry (@sivacherry9) March 26, 2026
కంటికి గాయంతోనే రామ్ చరణ్ పెద్ది షూటింగ్ లొకేషన్ లో అభిమానులకు సెల్ఫీ గిఫ్ట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పెద్ది చిత్ర యూనిట్ మరో కానుక రెడీ చేస్తోంది. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న పెద్ది చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ పుట్టినరోజుకి ‘పెద్ది’ టీజర్ ట్రీట్!
Mega Power Star @AlwaysRamCharan Spotted Aura Farming at #Peddi Shooting Location ❤️🔥 #HBDRamCharan pic.twitter.com/OnWv1M3cuK
— Trends RamCharan ™ (@TweetRamCharan) March 26, 2026
ముందుగా టీజర్ ని ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అభిమానులని ఇంకా ఖుషీ చేస్తూ టీజర్ రిలీజ్ టైం ని ప్రీ పోన్ చేశారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకే టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. మొత్తంగా రాంచరణ్ పుట్టిన రోజున పెద్ది హంగామా ఒక రేంజ్ లో ఉండబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీజర్ విడుదలవుతోంది. అభిమానులకి ఇది నిజంగా పండగే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


