|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అయ్యప్ప దీక్షలో రామ్ చరణ్.. కాక్ టెయిల్ పార్టీలో మెగాస్టార్! అల్లు శిరీష్ దిమ్మతిరిగే కౌంటర్!!

Published: 24-02-2026, 8:35 AM
షాకింగ్: అయ్యప్ప దీక్షలో రామ్ చరణ్.. కాక్ టెయిల్ పార్టీలో మెగాస్టార్! అల్లు శిరీష్ దిమ్మతిరిగే కౌంటర్!!
  • అల్లు శిరీష్ పార్టీలో రామ్ చరణ్ సందడి.. అయ్యప్ప మాలధారణలో కనిపించిన మెగా పవర్ స్టార్!
  • ట్రోల్స్ చేసిన నెటిజన్లకు అల్లు శిరీష్ కౌంటర్.. పార్టీకి ముందే చరణ్ విషెస్ చెప్పారంటూ క్లారిటీ!
  • చరణ్ అయ్యప్ప దీక్షపై నిబద్ధత.. ప్రతి సంవత్సరం 41 రోజుల కఠోర దీక్ష!
  • మెగా అభిమానులకు పండగ.. రామ్ చరణ్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు!

మెగా అభిమానులకు ఒక సంచలన వార్త! రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండి కూడా కాక్ టెయిల్ పార్టీకి హాజరయ్యారా? అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పూర్తి వివరాలు మీకోసం.

అయ్యప్ప మాలలో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ తమ్ముడు అల్లూ శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల ఆయనకు ఎంగేజ్మెంట్ గా.. మార్చి నెలలో పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి నేపథ్యంలో.. అల్లూ అర్జున్ తన సోదరుడు అల్లూ శిరీష్, అతనికి కాబోయే భార్య నైనికా రెడ్డి కోసం ఓ కాక్ టెయిల్ పార్టీ ఏర్పాటు చేశారు. కాక్ టెయిల్ పార్టీ అంటే.. మందు, మద్యం ఉంటాయి అని అందరికీ తెలిసిందే. దీంతో.. అలాంటి ప్రదేశానికి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరు కావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఈ కాక్ టెయిల్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అల్లు శిరీష్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఒక వీడియోలో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన తో కలిసి కనిపించారు. చరణ్ అయ్యప్ప మాల ధరించి ఉండటం వీడియోలో క్లియర్ గా కనపడుతుంది. దీంతో.. ఈ విషయంపై అనుమానాలు వచ్చాయి. అలాంటి పార్టీకి అయ్యప్ప మాల ధరించిన వాళ్లు వెళతారా అంటూ చాలా మంది సోషల్ మీడియాలో చరణ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కామెంట్స్ వర్షం కురిపించారు.

అల్లు శిరీష్ పార్టీలో మెగా సందడి.. కారణం ఇదే!

ఈ కామెంట్స్ పై తాజాగా అల్లు శిరీష్ స్పందించారు. ఆ ట్రోలర్స్ నోరు మూయించేలా సమాధానం చెప్పారు.‘ పార్టీలో మేమంతా మందు ముట్టుకోవడానికి ముందే స్వామి వచ్చి, మాకు శుభాకాంక్షలు చెప్పి.. తర్వాత వెంటనే వెళ్లిపోయారు’ అంటూ అల్లూ శిరీష్ చెప్పారు. శిరీష్ ఇచ్చిన క్లారిటీతో కాంట్రవర్సీకి పులిస్టాప్ పడింది.

అయ్యప్ప దీక్ష పట్ల రామ్ చరణ్ నిబద్ధత..

ట్రోల్స్ పై స్పందించిన అల్లు శిరీష్.. అసలు నిజం చెప్పేశాడు!

రామ్ చరణ్ కి అయ్యప్ప దీక్ష పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఆయన ఈ దీక్ష చేపడుతూనే ఉన్నారు. చాలా నిష్టతో 41 రోజుల దీక్ష చేసి.. ఆ తర్వాత.. శబరిమల దర్శిస్తూ ఉంటారు.

రామ్ చరణ్, అల్లు శిరీష్ ల గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూనే ఉంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.