
ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆర్చరీ లీగ్ ప్రారంభోత్సవం విజయవంతం కావడంతో ఆయనను కలిసినట్లు చరణ్ వెల్లడించారు. మోదీతో భేటీ అయిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Key Points
ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు.
ఆర్చరీ లీగ్ ప్రారంభోత్సవం తర్వాత ఈ భేటీ జరిగింది.
మోదీతో చరణ్ దంపతుల ఫొటోలు వైరల్ అయ్యాయి.
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది.
మోదీతో చరణ్ దంపతుల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయనతో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్‌గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. సదరు లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆర్చరీ లీగ్ విజయోత్సవం
మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్‌కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి.
రామ్ చరణ్ సినిమాల అప్డేట్స్
చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’తో వచ్చాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతోంది. వేసవికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
మోదీతో రామ్ చరణ్ దంపతుల భేటీ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక క్షణాల ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్చరీ లీగ్ విజయాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ భేటీ ప్రాముఖ్యతను చాటింది.


