|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ సీక్రెట్స్ లీక్ చేసిన చరణ్! తండ్రీకొడుకుల మధ్య ఇంత అనుబంధమా? వైరల్ న్యూస్!

Published: 17-04-2026, 5:35 AM
మెగాస్టార్ సీక్రెట్స్ లీక్ చేసిన చరణ్! తండ్రీకొడుకుల మధ్య ఇంత అనుబంధమా? వైరల్ న్యూస్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ జూన్ లో విడుదల, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం!
  • Esquire India మ్యాగజైన్ కవర్ పేజీపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సంచలనం!
  • చిరంజీవి నుండి స్ఫూర్తి పొందిన రామ్ చరణ్, తండ్రి గొప్పతనం గురించి ఎమోషనల్ కామెంట్స్!
  • సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ ప్లానింగ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. చిరంజీవి తన జీవితంలో ఎలా ఆదర్శంగా నిలిచారో చరణ్ ఎమోషనల్ గా వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి కష్టాలను గుర్తు చేసుకున్న రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినప్పటిక.. ఈ సినిమా కోసం కొంత వర్క్ పెండింగ్ లో ఉండటంతో.. ఆడియన్స్ కు మరింత అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు మూవీ టీమ్ ఈ సినిమా రిలీజ్ ను జూన్ నెలకు వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ మరో అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ప్రెస్టేజియస్  Esquire India మ్యాగజైన్ కవర్‌పై చోటు సంపాదించిన టాలీవుడ్ హీరోగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఇది ఆయన కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన వ్యక్తిగత , వృత్తిగత జీవితంపై తండ్రి చిరంజీవి ప్రభావాన్ని గుర్తుచేసుకున్నారు.

ఫ్యామిలీకి చిరంజీవి ఇచ్చిన ప్రాధాన్యత

మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో నిజమైన హీరో అని ఆయన గర్వంగా చెప్పారు. నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం తేలికగా కనిపించినా, ఆయన పడిన కష్టం అమూల్యమని వివరించారు. చిరంజీవి తన కెరీర్ ప్రారంభ దశల్లో ఎంత కష్టపడ్డారో చెప్పిన చరణ్, షూటింగ్‌ల కోసం రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారని వెల్లడించారు. అయినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంలో ఎప్పుడూ రాజీ పడలేదని చెప్పారు.

ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా ఇంట్లో సాధారణ తండ్రిలా ఉండటం ఆయన ప్రత్యేకత.. ఈ విషయంలో నేను ఆయన్ను ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్నానని చరణ్ అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు సహాయం చేయడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని చరణ్ అన్నారు. అంతే కాదు ప్రోఫిషినల్ లైఫ్ ను.. పర్సనల్ లైఫ్ ను ఎలా బ్యాలన్స్ చేయాలి అనేది తాను తన తండ్రి దగ్గర నేర్చుకున్నానని రామ్ చరణ్ అన్నారు.

ప్రోఫెషనల్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా?

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగే గుణం చిరంజీవిలో ఉంది. ఆప్రభావం కూడా తనపై ఎక్కువ ఉందని .. ప్రస్తుతం తాను కూడా అదే దారిలో నడుస్తున్నట్టు రామ్ చరణ్ వెల్లడించారు. మూడు రోజులైనా బ్రేక్ దొరికితే.. ఫ్యామిలీకి టైమ్ ఇవ్వాలన్నది మెగాస్టార్ దగ్గర నేర్చుకున్నానని చెప్పారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా తరువాత సుకుమార్ తో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు చరణ్.

రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానుల్లో ఇది మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.