|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ సంచలనం: కొత్త దర్శకుడితో మెగా మూవీ! ఫ్యాన్స్ షాక్!

Published: 20-03-2026, 5:35 AM
రామ్ చరణ్ సంచలనం: కొత్త దర్శకుడితో మెగా మూవీ! ఫ్యాన్స్ షాక్!
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త డైరెక్టర్‌తో సెన్సేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
  • కమర్షియల్ హంగులు లేకుండా స్ట్రాంగ్ కంటెంట్‌తో రానున్న రామ్ చరణ్ మూవీ, ఫ్యాన్స్‌కి పండగే!
  • రియలిస్టిక్ పాత్ర కోసం రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్, లుక్ పూర్తిగా చేంజ్!
  • సుకుమార్ సినిమా తర్వాత కొత్త డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ ట్రాక్ ఎక్కే అవకాశం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సంచలనానికి తెరలేపారు. ఒక కొత్త డైరెక్టర్‎తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ.. స్టోరీ ఇదే!

Ram charan : చిరుత నుంచి పెద్ది వరకు రామ్‌చ‌ర‌ణ్‌ చేసిన సినిమాలు సమ్‌థింగ్‌ స్పెషల్. ఇప్పుడు మరోసారి అలాంటి సరికొత్త కథతో అభిమానులతో అలరించబోతున్నాడట చెర్రీ. ఒక కొత్త డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వబోతున్నాడట. ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా, స్ట్రాంగ్ కంటెంట్‌తో పాటు ఒక ఫ్రెష్ స్టోరీగా ఉండబోతుందని టాక్.

లుక్ మార్చేసిన రామ్ చరణ్.. స్పెషల్ ట్రైనింగ్!

కథలో యాక్షన్, ఎమోషన్, సోషల్ మెసేజ్.. కలిపి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్‌చరణ్ తన లుక్, బాడీ లాంగ్వేజ్‌లో కూడా పూర్తిగా మార్పులు తీసుకురాబోతున్నాడని సమాచారం. ఒక రియలిస్టిక్, ఇన్‌టెన్స్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని, దీనికోసం స్పెషల్‌ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని అంటున్నారు. సినిమా టెక్నికల్‌గా కూడా హైస్టాండర్డ్స్‌లో ఉండేలా టాప్ టెక్నీషియన్స్‌ను సెలక్ట్‌ చేస్తారట.

సుకుమార్ తర్వాత కొత్త డైరెక్టర్ ప్రాజెక్ట్!

ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, ఈ కొత్త డైరెక్టర్‌తో చేసే ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మరోసారి తన రేంజ్‌ను ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడట. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా, ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీగా చర్చ జరుగుతోంది. అభిమానులు కూడా ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా తర్వాత సుకుమార్‌తో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడు చెర్రీ. ఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో చేయబోయే ప్రాజెక్ట్ ట్రాక్‌ ఎక్కే అవకాశం ఉంది.

రామ్ చరణ్ కొత్త సినిమా గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.