
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు 200 మిలియన్ల వ్యూస్.
- చికిరి చికిరి పాటకు రామ్ చరణ్ హుక్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంటోంది.
- త్వరలో ‘పెద్ది’ సినిమా నుండి రెండవ పాటను విడుదల చేయనున్నారు.
- ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
‘చికిరి చికిరి’ పాట సృష్టించిన రికార్డు
Peddi:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్(Ram Charan). ‘చిరుత’ సినిమాతో విమర్శలు ఎదుర్కొన్న ఈయన.. ఆ తర్వాత వచ్చిన ‘మగధీర’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు. తన నటనలో మార్పులు చేసుకుంటూ.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అనే బిరుదును కూడా దక్కించుకున్నారు. అలాంటి రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం పెద్ది. అటు సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబుసన(Bucchibabu Sana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన “చికిరి చికిరి” పాట సోషల్ మీడియాలో దూసుకుపోతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అన్ని భాషలలో కలుపుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఈ పాట యూట్యూబ్లో 200 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా లక్షల్లో లైకులు పొందుతూ రామ్ చరణ్ చికిరి పాట సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇందులో రామ్ చరణ్ హుక్ స్టెప్ అందరిని ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతిఒక్కరూ ఈ హుక్ స్టెప్ తో అదరగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండింగ్ హుక్ స్టెప్ గా మారిపోయిందని చెప్పవచ్చు.
హుక్ స్టెప్ తో అదరగొడుతున్న రామ్ చరణ్
ఇకపోతే ఈ సినిమా నుండి రెండో పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.నిజానికి గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అప్పుడు పెద్ద సినిమాల విడుదల ఉండడంతో వాయిదా వేసుకున్నారు. ఈ సంక్రాంతి కైనా మెగా అభిమానులకు ట్రీట్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఈ సంక్రాంతికి కూడా ఈ సినిమా రెండవ పాటను విడుదల చేయలేదు. ఇక త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
త్వరలో విడుదల కానున్న రెండో పాట
రామ్ చరణ్ తదుపరి చిత్రాల విషయానికొస్తే.. గతంలో ప్రముఖ పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ తో రంగస్థలం సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో మాస్ లుక్కులో కనిపించడమే కాకుండా చెవిటి అబ్బాయి పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారు రామ్ చరణ్. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు సుకుమార్. పెద్ది సినిమా విడుదలైన వెంటనే ఈ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నట్లు సమాచారం.
చివరిగా, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని పాట రికార్డులు సృష్టిస్తుండటం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. త్వరలో విడుదల కాబోయే రెండవ పాట కోసం ఎదురుచూద్దాం.


