
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ డబ్బింగ్ వీడియో వైరల్: ఫ్యాన్స్ ఫిదా!
- బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ‘పెద్ది’ మూవీ.
- ఏఆర్ రెహమాన్ సంగీతం: రేపే రెండో పాట ‘రయ్ రయ్ రా రా’ విడుదల.
- ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ‘పెద్ది’తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
చరణ్ డబ్బింగ్ స్టూడియో సందడి!
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్స్ వచ్చాయి. ఏఆర్ రెహమాన్ కంపోచ్ చేసిన రెండో పాట సోమవారం (మార్చి 2) విడుదల కానుండగా.. చరణ్ అప్పుడే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించి అభిమానుల్లో జోష్ నింపాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఒకేసారి రెండు అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చారు. ఈ మూవీ కోసం చరణ్ డబ్బింగ్ చెబుతున్న వీడియో పోస్ట్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.
డబ్బింగ్ స్టూడియోలో రామ్ చరణ్ సందడి
‘రయ్ రయ్ రా రా’ సాంగ్ రిలీజ్ అప్డేట్
ఆ వీడియోలో బుచ్చిబాబు ను చరణ్ ఆట పట్టించడం చూడొచ్చు. చికిరి సాంగ్ లో మోహిత్ చౌహాన్ వాయిస్ చేసినట్లు తన డబ్బింగ్ కూడా నువ్వే చెప్పొచ్చు కదా అని చరణ్ అందులో అనడం చూడొచ్చు. ఏమది అనే ఓ డైలాగ్ ఈ డబ్బింగ్ కోసం చరణ్ చెప్పాడు.
రేపే రెండో పాట ‘రయ్ రయ్ రా రా’..
ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల!
పెద్ది ఏప్రిల్ 30న విడుదల
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సమర్పిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ పాన్-ఇండియన్ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి కాకముందే డబ్బింగ్ మొదలుపెట్టడం చూస్తుంటే, సినిమాను సకాలంలో థియేటర్లకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఎంతగా శ్రమిస్తుందో అర్థమవుతోంది.
‘పెద్ది’ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే డబ్బింగ్ మొదలుపెట్టడం చూస్తుంటే, సినిమాపై ఉన్న ప్యాషన్ తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

