
📌 Key Points
- రణవీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమాతో జియో స్టూడియోస్ భారీ విజయం
- రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ‘పెద్ది’ చిత్రం
- నార్త్ ఇండియా పంపిణీ హక్కులను దక్కించుకున్న జియో స్టూడియోస్
- ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ విడుదల
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా పంపిణీ హక్కులను జియో స్టూడియోస్ భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మరోసారి నిరూపించుకోనున్నాడని తెలుస్తోంది.
జియో స్టూడియోస్ కన్ను ‘పెద్ది’పై
Peddi Movie: భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించే చర్చ జరుగుతోంది. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ పెద్ది పై కన్నేసింది. ఈ సినియాను నార్త్ ఇండియాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది.
Read also- Sharwanand: జీవితంలో ఆ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోవద్దు -హీరో శర్వానంద్
రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ ఇండియా పంపిణీ హక్కులను జియో స్టూడియోస్ భారీ ధరకు దక్కించుకుంది. ‘ధురందర్’ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత వారు పంపిణీ చేస్తున్న సినిమా కావడంతో, హిందీ బెల్ట్‌లో ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ చరణ్‌కు ‘RRR’ తర్వాత ఉన్న పాన్-ఇండియా క్రేజ్ దృష్ట్యా, ఈ డీల్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక పల్లెటూరి యువకుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. క్రీడల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ జర్నీ కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు కూడా చెప్పబోతున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ వంటి పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృద్ధి సినిమాస్ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘పెద్ది’ విడుదల ఎప్పుడు?
Read als0- Samantha: దాన్ని అనుభవించే హక్కు మీకుంది.. మరోసారి మహిళా హక్కులపై సమంత పోరాటం!
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్లకుంటుంది. జియో స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ ‘పెద్ది’ వెనుక నిలబడటంతో, ఈ సినిమా నార్త్ ఇండియాలో కూడా ‘పుష్ప’, ‘RRR’ తరహాలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ధురందర్’ ఇచ్చిన ఊపుతో జియో స్టూడియోస్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.
జియో స్టూడియోస్ ‘పెద్ది’ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రామ్ చరణ్ క్రేజ్, బుచ్చిబాబు దర్శకత్వం ఈ సినిమాకు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి. ఏప్రిల్ 30, 2026న సినిమా విడుదల కానుంది.


