
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదల వాయిదా, మెగా ఫ్యాన్స్‌కు షాక్!
- మార్చి 27 నుంచి మే 1కి విడుదల తేదీ మార్పు, కారణం షూటింగ్ ఆలస్యం!
- సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం, రంగస్థలం తరహాలో హిట్ కొట్టే ప్రయత్నం!
- జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. అసలు ఏం జరిగింది?
పెద్ది మూవీ రిలీజ్ ఎప్పుడు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పెద్ది. చాలా రోజుల నుంచి హిట్ కోసం ప్రయత్నం చేస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. రంగస్థలం తరహాలోనే ఈ సినిమాను హిట్ చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా పాటలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పెద్ది సినిమా గురించి ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పెద్ద సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మార్చి 27వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే ఒకటో తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతోందట చిత్ర బృందం. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మే మొదటి వారంలో రిలీజ్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని చిత్ర బృందం భావించి.. ఇలా పోస్ట్ పోన్ చేస్తుందని మరి కొంతమంది అంటున్నారు.
ఎందుకు వాయిదా పడింది?
సినిమాలో విశేషాలు ఏంటి?
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ వాయిదా వార్త మెగా అభిమానులను నిరాశపరిచింది. మే 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


