
రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ సినిమా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. 110 కోట్ల రూపాయలకు పైగా ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. సినిమా హిట్ అయితే ఈ మొత్తం మరింత పెరగవచ్చు.
Key Points
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
110 కోట్ల రూపాయలకు పైగా డీల్ కుదిరినట్లు సమాచారం.
సినిమా హిట్ అయితే డీల్ మొత్తం మరింత పెరగవచ్చు.
రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ కుదరడం చర్చనీయాంశం అవుతోంది.
పెద్ది సినిమా ఓటీటీ డీల్ వివరాలు
Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. వచ్చే సంవత్సరం మార్చ్ 27 రిలీజ్ చేస్తామని డేట్ కూడా ఇచ్చేసారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా ఆశించినంత ఫలితం రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. తాజాగా పెద్ది సినిమా ఓటీటీ డీల్ వైరల్ గా మారింది.
నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్
రిలీజ్ ముందు ఓటీటీ డీల్ ప్రభావం
పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ తో ఓటీటీ డీల్ చేసుకుందని తెలుస్తుంది. అన్ని భాషల్లో కలిపి పెద్ది సినిమాకు 110 కోట్ల ఆఫర్ నెట్ ఫ్లిక్స్ ఇచ్చిందని టాలీవుడ్ సమాచారం. ఈ సినిమా పెద్ద హిట్ అయితే ఆ అమౌంట్ ఇంకా పెరుగుతుంది అనేదానిపై అగ్రిమెంట్ చేసుకున్నారట. సో పెద్ది సినిమా ఎలాగో హిట్ అవుతుందనే అంతా భావిస్తునారు కాబట్టి 110 కోట్లకంటే ఎక్కువే ఓటీటీ నుంచి వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి పెద్ది సినిమా రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే ఓటీటీకి అమ్ముడు పోవడం గ్రేట్ అంటున్నారు.
మొత్తంగా, పెద్ది సినిమా ఓటీటీ డీల్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. రిలీజ్ కు ముందే ఇంత భారీ డీల్ కుదరడం సినిమాపై ఉన్న అంచనాలను తెలియజేస్తుంది.


