
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ టైటిల్ సాంగ్ ఫిబ్రవరి చివరిలో విడుదల కానుంది, మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు!
- చికిరి సాంగ్ తర్వాత, ఏఆర్ రెహమాన్ మరో మ్యూజికల్ ట్రీట్ అందించనున్నారు, అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
- బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
- శివ రాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తుండటంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘చికిరి సాంగ్’ సంచలనం సృష్టించిన తర్వాత, ఇప్పుడు టైటిల్ సాంగ్ విడుదల కానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.
టైటిల్ సాంగ్‌తో దుమ్ము రేపేందుకు రెడీ!
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పెద్ది సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలా కాలం తరువాత తనకు బాగా నచ్చిన కథతో సినిమా చేస్తున్నట్టుగా చెప్తున్నాడు రామ్ చరణ్.
అందుకు తగ్గట్టుగానే పెద్ది(Peddi) నుంచి విడువులైన కంటెంట్ కూడా ఉండటంతో అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. మేకర్స్ కూడా ఆ హైప్ ను అదే రేంజ్ లో మైంటైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఇక ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవల్లో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏఆర్ రహమాన్ అందించిన క్యాచీ ట్యూన్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది.
ఫిబ్రవరిలో మెగా ట్రీట్.. ఫ్యాన్స్ ఖుషీ!
ఇప్పుడు పెద్ది సినిమా నుంచి రెండో సాంగ్ ను విడుదల చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. రామ్ చరణ్ ఇంట్రోలో వచ్చే పెద్ది టైటిల్ సాంగ్ ను విడుదల చేయాలనీ చూస్తున్నారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఫిబ్రవరీ ఎండింగ్ లో ఈ సాంగ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో, మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమాను రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా మార్చ్ 27న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఏప్రిల్ 30కి వాయిదా పడింది.
సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ఇదే!
కానీ, పెద్ది ఎప్పుడు వచ్చినా ఆ ఇంపాక్ట్ సాలిడ్ గా ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కూడా మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ, సినిమాపై ఉన్న అంచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. టైటిల్ సాంగ్ విడుదల కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


