
📌 Key Points
- చిరంజీవి సరసన రాధా నటనంటే రాంచరణ్‌కి మహా ఇష్టమట; డ్యాన్సుల్లో ఆమె టైమింగ్ అదుర్స్ అంటున్న మెగా వారసుడు!
- తమన్నా డ్యాన్స్ బాగా చేస్తుందంటే కారణం అల్లు అర్జునే; బన్నీ హెల్ప్ చేశాడని చెప్పిన తమన్నా భాటియా.
- ఎన్టీఆర్ నేచురల్ డ్యాన్సర్; తారక్ డైలాగ్ డెలివరీ అంటే చాలా ఇష్టం అని మనసులోని మాట బయటపెట్టిన తమన్నా.
- రాంచరణ్, తమన్నా కలిసి రచ్చ మూవీలో నటించిన విషయం తెలిసిందే; ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు. అయితే రామ్ చరణ్ కి ఆయన తండ్రి సరసన నటించిన హీరోయిన్స్ లో ఒక ప్రత్యేకమైన నటి అంటే చాలా ఇష్టమట. ఆ హీరోయిన్ ఎవరు? అసలు విషయం తెలుసుకుందామా!
చిరంజీవి హీరోయిన్లలో రాంచరణ్ ఫేవరెట్ ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించారు. రాధిక, రాధా, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చిరంజీవి ఎక్కువ సినిమాలు చేశారు. హీరోయిన్లు ఎంత బాగా డ్యాన్స్ చేసినా చిరంజీవి చేసే డ్యాన్సులు బాగా అభిమానులని ఆకట్టుకునేవి. రాధా, విజయశాంతి లాంటి వారు చిరంజీవితో పోటీగా డ్యాన్స్ చేయాలని ప్రయత్నించేవారు.
రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాన్నగారితో నటించిన హీరోయిన్లలో రాధా గారు అంటే తనకు బాగా ఇష్టం అని తెలిపారు. నాన్న గారు, రాధా గారు డ్యాన్స్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది. రాధా గారు పర్ఫెక్ట్ టైమింగ్ తో డ్యాన్స్ చేసేవారు. కొంచెం ఎక్కువ, తక్కువ కూడా అయ్యేది కాదు. ఈ విషయాన్ని రాంచరణ్ తమన్నాతో చెప్పారు.
తమన్నా డ్యాన్స్ సీక్రెట్ చెప్పిన రాంచరణ్!
నాకు తెలిసి రాధా గారి తర్వాత అంత పర్ఫెక్ట్ గా హీరోలతో డ్యాన్స్ చేసేది మీరే అని తమన్నా పై రాంచరణ్ ప్రశంసలు కురిపించారు. ఈ విషయం నేను చెప్పట్లేదు. చాలా మంది చెప్పారు. నాన్నగారు కూడా అన్నారు అంటూ రాంచరణ్ రివీల్ చేశారు.
ఇలాంటి కోస్టార్స్ ఉంటే హీరోలకు పెద్ద బూస్ట్ అని రాంచరణ్ తెలిపారు. రాంచరణ్, తమన్నా ఇద్దరూ రచ్చ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ సూపర్ హిట్ అయింది.
ఎన్టీఆర్ గురించి తమన్నా ఏం చెప్పారంటే?
ఆ తర్వాత రాంచరణ్ తమన్నాని అల్లు అర్జున్, ఎన్టీఆర్ గురించి ప్రశ్నించారు. వీళ్లిద్దరితో కూడా తమన్నా నటించింది. వీళ్ళిద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని రాంచరణ్ ప్రశ్నించారు. దీనికి తమన్నా బదులిస్తూ తాను డ్యాన్స్ బాగా చేస్తున్నాను అంటే అందుకు కారణం అల్లు అర్జున్ అని తమన్నా పేర్కొంది. డ్యాన్స్ విషయంలో బన్నీ నాకు హెల్ప్ చేశాడు. ఇక తారక్ విషయానికి వస్తే తారక్ నేచురల్ డ్యాన్సర్. కానీ అంతకంటే ఎక్కువగా తారక్ డైలాగ్ డెలివరీ అంటే ఇష్టం అని తమన్నా పేర్కొన్నారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంచరణ్ మరియు తమన్నా ల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


