
📌 Key Points
- రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు, ఒకరు బాబు కావడంతో అభిమానుల్లో ఆనందం.
- క్లింకార పేరులాగే, పుట్టిన పిల్లలకు దేవుడి పేర్లు వచ్చేలా పెట్టాలని ఆలోచనలో ఉన్నారు.
- బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ ఆంజనేయులు లేదా శ్రీరాముడి పేర్లతో పేరు పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు.
- రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు.
మెగాస్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. బాబు పుట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పిల్లలకు దేవుడి పేర్లు వచ్చేలా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ ఇంట్లో కవల పిల్లల సందడి
Ram Charan Son Name: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అవ్వడంతో మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి. తమ హీరో రెండోసారి తండ్రి కావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ హీరోకి శుభాకాంక్షలు తెలుపుతూ హంగామా చేస్తున్నారు. ఇద్దరు కవలపిల్లలకు జన్మని ఇవ్వడం, అందులో ఒక బాబు ఉండడం వాళ్లకు పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది.. మెగా ఫ్యామిలీలో మూడో తరంలో ఒక వరుణ్ తేజ్ కు తప్ప పెళ్లైన వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలు పుట్టారు. మొత్తానికి రామ్ చరణ్ తన తండ్రి బాటలోనే నడిచాడు.. ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి పుట్టారు.. అయితే వీరిద్దరి పేర్లు గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటి పాప క్లింకార కు ఎలాగైతే దేవుడి పేరు కలిసొచ్చేలా పెట్టారో.. ఈ పిల్లలకి కూడా అలాంటి పేర్లే పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త నెట్ ఇంత ప్రచారంలో ఉంది.. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..
హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల కవలపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ పిల్లల పేర్లు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త కోడై కూస్తుంది. మొదటి పాపకు ఎలాగైతే పేర్లు పెట్టారో అలాగే ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా దేవుడి పేర్లు వచ్చేలా పేర్లు పెట్టనున్నారట.. గతంలో రామ్ చరణ్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొన్నప్పుడు ఆంజనేయుల స్వామి లేదా శ్రీరాముడు పేర్లతో వచ్చేలా పేర్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు బయటపెట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఈ దేవుళ్ళ పేర్లు వచ్చేలా అంటే ఎలాంటి పేర్లు ఉంటాయో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. మరి కొన్ని రోజుల్లో పిల్లలకు పేర్లు పెట్టే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వినిపిస్తుంది..
దేవుడి పేరుతోనే పిల్లల పేర్లు?
రామ్ చరణ్ కొత్త సినిమా అప్డేట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలని లైన్లో పెట్టుకుంటూ వస్తున్నాడు.. ప్రస్తుతం ఈయన ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటించిన ఉన్నారు.. ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది..ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి పాట ప్రస్తుతం యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది.. భారీ బడ్జెట్ తో తెరికెక్కుతున్న చిత్రం మార్చి నెలలో విడుదల కాబోతుందని ప్రకటించారు.. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి ఈ మూవీ తో రామ్ చరణ్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే..
మొత్తానికి రామ్ చరణ్ తన పిల్లలకు ఎలాంటి పేర్లు పెడతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


