|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్‌ చరణ్‌తో శ్రీలీల మాస్‌ స్టెప్పులు.. మరో ‘కిస్సిక్‌’ అవుతుందా?

Published: 05-05-2025, 5:44 AM
రామ్‌ చరణ్‌తో శ్రీలీల మాస్‌ స్టెప్పులు.. మరో ‘కిస్సిక్‌’ అవుతుందా?

రామ్ చరణ్ నటించే ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, ఈ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశం ఉంది. ‘కిస్సిక్’ లాంటి మరో మాస్ ఐటమ్ సాంగ్ ఇది కావచ్చని అంటున్నారు.

Key Points

1

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో ‘పెద్ది’ సినిమా షూటింగ్ జరుగుతోంది.

2

శ్రీలీల ‘పెద్ది’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశం ఉంది.

4

శ్రీలీల బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ డేట్స్ కేటాయించడం కష్టం.

‘పెద్ది’ సినిమా షూటింగ్‌ పురోగతి

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న‘పెద్ది’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు రామ్‌ చరణ్‌ నాన్‌స్టాప్‌గా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు కాస్త బ్రేక్‌ తీసుకొని టుస్సాడ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం విదేశాలకు వెళ్తున్నారు. రామ్‌ చరణ్‌ రావడానికి కనీసం రెండు, మూడు వారాలైనా పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇందులో ఒక ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉంటుందట. ఈ పాటను కాజల్‌తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్ని పుకార్లు మాత్రమే. బుచ్చిబాబు ప్లాన్‌ వేరే ఉందంట. ఓ స్టార్‌ హీరోయిన్‌తో ఈ ఐటమ్‌ సాంగ్‌కి స్టెప్పులేయించబోతున్నాడట. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో కాదు మన ‘కిస్సిక్‌’ పాప శ్రీలీలనే.

పుష్ప 2 చిత్రంలో శ్రీలీల చేసిన ఐటం సాంగ్‌ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో కలిసి చిందులేసేందుకు శ్రీలీల రెడీ అవుతోందని టాలీవుడ్‌లో వినిపిస్తున్న లేటెస్ట్‌ గాసిప్‌. రంగస్థలంలోని ‘జిగేల్‌ రాణి’ మాదిరి పెద్దిలో కూడా ఓ ఊరమాస్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశాడట బుచ్చిబాబు. ఈ పాటకు శ్రీలీల అయితేనే న్యాయం చేస్తుందని మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలకు చెప్పాడట. అయితే వాళ్లు ఇంకా శ్రీలీలను సంప్రదించలేదట. కానీ దాదాపు ఆమెతోనే ఆ పాట చేయించాలని ఫిక్స్‌ అయినట్లు సమాచారం.

శ్రీలీల ఐటమ్‌ సాంగ్‌ అవకాశం

ఇప్పట్లో శ్రీలీల డేట్స్‌ దొరకడం చాలా కష్టం. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సినిమా షూటింగ్‌, ప్రమోషన్స్‌కే ఎక్కువ డేట్స్‌ కేటాయించింది. ఆ సినిమా తర్వాత రవితేజ మాస్‌ జాతర షూటింగ్‌లో పాల్గొంటుంది.అలాగే శివకార్తికేయన్ ‘పరాశక్తి’, అఖిల్ ‘లెనిన్’ కూడా లైన్‌లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న శ్రీలీలకి ‘పెద్ది’ కోసం ఇప్పట్లో డేట్స్‌ కేటాయించే చాన్స్‌ అయితే లేదు. బుచ్చిబాబుకు కూడా ఇప్పుడే ఆ పాట కావాలన్న డిమాండేమి లేదు.

బిజీ షెడ్యూల్‌ సవాళ్లు

సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు శ్రీలీల మూడు నాలుగు రోజులు డేట్స్‌ కేటాయిస్తే చాలు.. పాట అయిపోతుంది. మరి శ్రీలీల చేసే ఈ రెండో ఐటమ్‌ సాంగ్‌ కూడా ‘కిస్సిక్‌’ మాదిరి సూపర్‌ హిట్‌ అవుతుందో లేదో చూడాలి. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీలీల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ‘పెద్ది’ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయడం ఖాయమేనా అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ సాంగ్ ‘కిస్సిక్’ లాంటి హిట్ అవుతుందో లేదో చూడాలి.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.