
📌 Key Points
- రామ్ చరణ్ స్వామి మాలపై నెటిజన్ల కామెంట్స్!
- అల్లు శిరీష్ స్ట్రాంగ్ కౌంటర్: పార్టీ ఇంకా మొదలుకాలేదు!
- రామ్ చరణ్ సినిమా: బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీ!
- ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. రామ్ చరణ్ స్వామి మాలలో ఉండగా నెటిజన్లు చేసిన కామెంట్స్ కు అల్లు శిరీష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
రామ్ చరణ్ పై నెటిజన్ల ట్రోలింగ్స్!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అల్లు శిరీష్ పెళ్లి సందర్బంగా ఇచ్చిన పార్టీకి వెళ్లారు. అయితే, ఆ సమయంలో రామ్ చరణ్ స్వామి మాలలో ఉన్నారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. రామ్ చరణ్ పై చాలా మంది నెగిటీవ్ కామెంట్స్ చేశాడు. స్వామి మాలలో అలాంటి పార్టీకి వెళ్తారు. వాళ్ళను ఎలా ముట్టుకున్నారు. ఇది స్వామి మాలను అవమానించడమే అవుతుంది అంటూ నెట్టింట చాలా మంది కారుకూతలు కుశారు.
తాజాగా వాళ్లందరికీ చెంప చెళ్లుమనిపించేలా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు అల్లు శిరీష్. అల్లు శిరీష్ రామ్ చరణ్(Ram Charan) స్వామితో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటో కింద చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ లో ఒకతను రామ్ చరణ్ స్వామి మాలలో పార్టీకి వచ్చాడు అని కామెంట్ చేశాడు. దానికి సమాధానంగా అల్లు శిరీష్ సాలిడ్ రిప్లై ఇచ్చాడు.
అల్లు శిరీష్ కౌంటర్ తో దిమ్మతిరిగే షాక్!
రామ్ చరణ్ స్వామి ఆ పార్టీకి చాలా ఎర్లీగా వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఇంకా పార్టీ స్టార్ట్ అవలేదు. ఎవరు ఆల్కాహాల్ తీసుకోలేదు. ఆ సమయంలో ఆయన వచ్చి మమ్మల్ని కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయ్యప్ప స్వామి మాల పట్ల ఆయన అంత భక్తి శ్రద్దలతో ఉంటారు”అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు శిరీష్ చేసిన ఈ కామెంట్ తో రామ్ చరణ్ పై నెగిటీవ్ కామెంట్స్ చేసినవారికి చెంప చెళ్లుమనిపించేలా కౌంటర్ పడింది.
ఇక స్వామి మాలలో రామ్ చరణ్ పార్టీకి వెళ్లడంపై వస్తున్న ట్రోలింగ్ కి ఎండ్ కార్డు పడింది. నిజానికి, అయ్యప్ప మాల పట్ల రామ్ చరణ్ చాలా శ్రద్దగా ఉంటారు. ఒక ఏడాదిలో కనీసం వందరోజులైనా ఆయన మాలలో కనిపిస్తారు. తనను తాను మానసికంగా కంట్రోల్ చేసుకోవడానికి, వ్యక్తిగతంగా దృడంగా మార్చుకోవడానికి ఆయన మాలను ధరిస్తాడని గతంలోనే చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ కొత్త సినిమా అప్డేట్స్!
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు బుచ్చిబాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నాడు. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
రామ్ చరణ్ గురించి మరియు ఆయన సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


