|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘ది ఇండియా హౌస్’కు బిగ్ షాక్: ఆగిపోయిందనుకుంటే.. ఊహించని ట్విస్ట్!

Published: 17-04-2026, 10:05 AM
రామ్ చరణ్ 'ది ఇండియా హౌస్'కు బిగ్ షాక్: ఆగిపోయిందనుకుంటే.. ఊహించని ట్విస్ట్!
  • రామ్ చరణ్ నిర్మాతగా ‘ది ఇండియా హౌస్’ మూవీకి ఊహించని అప్డేట్: షూటింగ్ తిరిగి ప్రారంభం!
  • నిఖిల్, సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
  • భారీ బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’!
  • డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం: అభిమానులకు పండగే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వస్తున్న ‘ది ఇండియా హౌస్’ సినిమా గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా ఆగిపోయిందనుకున్న సమయంలో మళ్లీ షూటింగ్ మొదలు కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

‘ది ఇండియా హౌస్’ షూటింగ్ అప్డేట్: వైరల్ అవుతున్న న్యూస్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. నిఖిల్, సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న ప్రాజెక్టును రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ్ కేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో ఈ చిత్రం హంపీలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. అయితే.. ఈ సినిమా 2024లోనే స్టార్ట్ అవ్వగా ముందుకు మాత్రం వెళ్లడం లేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ది ఇండియన్ హౌస్’కు సంబంధించిన షూటింగ్ అప్డేట్‌పై ఓ పోస్ట్ వైరల్ అవుతున్నది.

భారతీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం సుమారు 30% పూర్తయిందని తెలుస్తుంది. కీలకమైన కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి, అనుపమ్ ఖేర్, నిఖిల్, మరికొందరు నటీనటుల డేట్స్ కోసం చిత్ర బృందం వెయిట్ చేస్తున్నారట. భారతదేశంలో అత్యంత క్లిష్టమైన, భద్రత కలిగిన ప్రాంతాలలో ఇప్పటికే ఒక భారీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే నిర్మాత రామ్ చరణ్ నిర్మాణ పనులను క్లోజ్‌గా అబ్జర్ చేస్తుండగా.. చిత్ర నిర్మాతలు ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతో ఆగిపోయింది అనకున్న ఈ సినిమాకు షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

రామ్ చరణ్ నిర్మాణంలో సినిమా: డిసెంబర్ రిలీజ్ ప్లాన్?

నిఖిల్, సయీ మంజ్రేకర్ జోడీ: షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే?

ది ఇండియా హౌస్ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.