|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా పవర్ స్టార్ చేతుల మీదుగా మరదలికి మాస్ ట్రీట్! ‘సతీ లీలావతి’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

Published: 01-05-2026, 4:46 PM
మెగా పవర్ స్టార్ చేతుల మీదుగా మరదలికి మాస్ ట్రీట్! 'సతీ లీలావతి' ట్రైలర్ డేట్ ఫిక్స్!
  • లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు.
  • మే 2న ఉదయం 10:31 గంటలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల.
  • భీమిలీ కబడ్డీ జట్టు దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్న చిత్రం.
  • మెగా అభిమానుల అంచనాలను పెంచుతున్న ట్రైలర్ అప్డేట్, సమ్మర్ స్పెషల్.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ! మెగా కోడలు లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ మాస్ అప్డేట్ తో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయనుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

మెగా బావా చేతిలో ట్రైలర్!

మెగా కోడలు, మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ నటి లావణ్య త్రిపాఠి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 8న రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల తేదీ లాక్ చేశారు. ఈ మేరకు ఓ క్యూట్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘అంచనాలు మరింత పెరిగాయి! మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మే 2వ తేదీన ఉదయం 10:31 గంటలకు ‘సతిలీలావతి’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.. వేసవిలో వేడివేడి విందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తెలిపారు. ఇక లావణ్య త్రిపాఠి సినిమా ట్రైలర్‌ను బావా అయిన రామ్ చరణ్ రిలీజ్ చేయబోతుండగా.. ‘మరదలు కోసం బావానా.. ఓకే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తాం’ అంటూ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

లావణ్యకు మాస్ సపోర్ట్!

వేసవికి స్పైసీ ట్రీట్!

మొత్తానికి లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ట్రైలర్ అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మెగా బావా, మరదలు కాంబినేషన్ ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.