|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ క్రేజీ కామెంట్: ఉపాసనతో పెళ్లిపై ఆ మాట… వైరల్ అవుతున్న ‘పెద్ది’ సీక్రెట్!

Published: 28-05-2026, 6:01 PM
రామ్ చరణ్ క్రేజీ కామెంట్: ఉపాసనతో పెళ్లిపై ఆ మాట... వైరల్ అవుతున్న 'పెద్ది' సీక్రెట్!
  • రామ్ చరణ్, ఉపాసనల ప్రేమ పెళ్లికి ముందు రహస్యంగా సాగిందని, రాత్రిపూట బైక్‌పై షికార్లు చేశారని వెల్లడైంది.
  • ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, ఉపాసన పెళ్లిపై చేసిన క్రేజీ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
  • ‘పెద్ది’ విజయం పెళ్లికి ముందే వచ్చి ఉంటే, ఇంకా మంచి సంబంధం వచ్చేదని చరణ్ సరదాగా వ్యాఖ్యానించారు.
  • మెగా కపుల్ మధ్య జరిగిన ఈ ఆసక్తికరమైన, సరదా సంభాషణ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల దాంపత్య జీవితం గురించి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో చరణ్ చేసిన ఓ క్రేజీ కామెంట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఈ వైరల్ వార్త పూర్తి వివరాలు ఇక్కడ!

రామ్ చరణ్-ఉపాసన లవ్ స్టోరీ వెనుక అసలు కథ!

రామ్‌ చరణ్‌.. ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల సమక్షంలోనే వీరి మ్యారేజ్‌ జరిగినా, పెళ్లికి ముందు వీరిద్దరు లవ్‌ లో ఉన్నారట. రాత్రి సమయాల్లో ఈ ఇద్దరు ప్రేమించుకునేవాళ్లట. బైక్ పై షికారుకి వెళ్లే వారట. కొన్నాళ్లపాటు రహస్యంగా ప్రేమించుకున్న తర్వాత మ్యారేజ్‌ చేసుకున్నారు. 2012లో వీరి మ్యారేజ్‌ జరిగింది. అయితే ఉపాసనతో మ్యారేజ్‌పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్‌ చరణ్.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమాలో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. జూన్‌ 4న విడుదల కాబోతుంది. పాన్‌ ఇండియా లెవల్‌లో దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ తో రామ్‌ చరణ్‌ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉపాసనతో పెళ్లిపై స్పందించారు రామ్‌ చరణ్‌.

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో చరణ్ క్రేజీ కామెంట్!

`పెద్ది` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సానా.. కారులో వెళ్తున్నారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ మూవీతో మీకు మంచి పేరొస్తుందని బుచ్చిబాబు తెలిపారు. మీకు మంచి సినిమా ఇవ్వాలని, మంచి పేరు తెచ్చే సినిమా ఇవ్వాలని చేశామని తెలిపారు. దీనికి రామ్‌ చరణ్‌ స్పందిస్తూ, ఏ ఇప్పుడు నాకు మంచి పేరు లేదా అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు బుచ్చిబాబు.

గతంలో ఉపాసన సమక్షంలో జరిగిన కన్వర్జేషన్‌ తెలిపారు. ఈ మూవీ చేయడం వల్ల మంచి పేరొస్తుందని అన్నారు. అయితే ఈ మంచి పేరేదో పెళ్లికి ముందు వస్తే బాగుండేదని, ఇంకా మంచి సంబంధం వచ్చేదని ఉపాసనగారి ముందు అన్నారని, దెబ్బకి ఆమె సీరియస్‌ అయ్యిందని వెల్లడించాడు బుచ్చిబాబు. ఆ సమయంలో సరదాగా జరిగిన కన్వర్జేషన్‌ ని వెల్లడించారు. దీనికి రామ్‌ చరణ్‌ కూడా అవును అని, ఇంకా మంచి సంబంధం వచ్చేదని ఆయన కూడా రియాక్ట్ కావడం విశేషం. అయితే ఇదంతా వారి మధ్య సరదాగా జరిగిన కన్వర్జేషన్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సినిమాకి కావాల్సిన మంచి ప్రమోషన్స్ ని తెచ్చిపెట్టింది.

వైరల్ అవుతున్న మెగా కపుల్ సరదా సంభాషణ!

స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మూవీ `పెద్ది`. ఇందులో రామ్‌ చరణ్‌ పహిల్వాన్‌గా, క్రికెటర్‌గా, అథ్లెట్‌గా కనిపించబోతున్నారు. ఓ అటవి ప్రాంతంలోని ఊర్లో, తమ భూమి కోసం చేసే పోరాటం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, క్లైమాక్స్ అదిరిపోతుందని తెలుస్తోంది. రామ్‌ చరణ్‌కి ఇది మంచి పేరుని తీసుకురావడంతోపాటు, అభిమానులను అలరించేలా ఉంటుందని, ఇన్‌స్పైర్‌ చేసే మూవీ అవుతుందని తెలిపారు బుచ్చిబాబు. అయితే దీనికి సంబంధించిన ప్రమోషన్స్ బాగా చేస్తున్నా, సినిమాకి హైప్‌ రావడం లేదు, బజ్‌ రావడం లేదు. ట్రైలర్‌ ఆకట్టుకునేలా లేకపోవడమే దీనికి కారణమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

రామ్ చరణ్, ఉపాసనల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ‘పెద్ది’ సినిమాపై అంచనాలను పెంచుతున్న ఈ వార్త మరింత ఆసక్తి రేపుతోంది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.