|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ పై వైరల్ ట్విస్ట్! ఆ రూమర్లకు బుచ్చిబాబు మాస్ చెక్!

Published: 22-05-2026, 6:15 AM
రామ్ చరణ్ 'పెద్ది' పై వైరల్ ట్విస్ట్! ఆ రూమర్లకు బుచ్చిబాబు మాస్ చెక్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం, ప్రమోషన్స్ పీక్స్‌లో.
  • ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొట్టి మిలియన్ల వ్యూస్ సాధించింది.
  • క్లైమాక్స్ లో కాలు పోతుందనే రూమర్లకు బుచ్చిబాబు ఫుల్ స్టాప్ పెట్టారు.
  • చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్, శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ హైలైట్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే వార్త! ‘పెద్ది’ చిత్రంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సినిమా క్లైమాక్స్ గురించి వైరల్ అయిన రూమర్లపై దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ మాస్ అప్డేట్ మీకోసం!

పెద్ది: క్లైమాక్స్ సస్పెన్స్ వీడిందా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ ఒక రేంజ్ లో సాగుతున్నాయి. ఇటీవల ట్రైలర్ లాంచ్ చేయగా అది యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. బుచ్చిబాబు ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీలో రాంచరణ్ క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా, రన్నర్ గా కనిపించబోతున్నారు.ఈ చిత్ర కథ గురించి అనేక థియరీలు ప్రచారంలో ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ థియరీలు ఇంకా ఎక్కువయ్యాయి. స్టోరీ గురించి వినిపిస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం క్లైమాక్స్ లో రాంచరణ్ కాలు పోతుంది అని ఆ తర్వాత కృత్రిమ లెగ్ తో రాంచరణ్ పారాలంపిక్స్ లో పాల్గొంటాడని ఆ సీన్లు చాలా ఎమోషనల్ గా ఉంటాయి అని ప్రచారం జరిగింది.

రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు క్లారిటీ

ట్రైలర్ లో రాంచరణ్ క్రికెటర్, కుస్తీకి సంబంధించిన సీన్లు కూడా చూపించారు.ఈ మూవీలో రాంచరణ్ క్రాసోవర్ అథ్లెట్ గా కనిపిస్తున్నారు. కానీ రన్నింగ్ కి సంబంధించిన సీన్స్ చూపించలేదు. దీనితో పెద్దికి కాలు ఉండదు అనే రూమర్స్ ఇంకా ఎక్కువయ్యాయి. బుచ్చిబాబు తొలి చిత్రంలో ఉప్పెనలో కూడానా క్లైమాక్స్ లో హీరో ఓ అవయవం కోల్పోతాడు. పెద్దిలో కూడా బుచ్చిబాబు అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ రూమర్స్ ని బుచ్చిబాబు పటాపంచలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి స్పందిస్తూ.. ఉప్పెన లాగా ఏమీ ఉండదు. అవయవం కోల్పోవడం జరగదు. కానీ ఆ ట్విస్ట్ మాత్రం థ్రిల్ చేసేలా ఉంటుంది అని బుచ్చిబాబు తెలిపారు.

ఉప్పెన సెంటిమెంట్ పెద్దికి వర్తించదా?

ఈ మూవీలో రాంచరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. జగపతి బాబు, శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రుతి హాసన్ ఈ మూవీలో ఐటెం సాంగ్ చేస్తోంది.

పెద్ది చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బుచ్చిబాబు ఇచ్చిన ఈ క్లారిటీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. రామ్ చరణ్ అభిమానులు, సినీ ప్రియులు ఈ సంచలన చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని విశేషాల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.