|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేప్ కేసు నిందితుడికి రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో అవకాశం.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Published: 01-11-2025, 3:08 AM
రేప్ కేసు నిందితుడికి రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో అవకాశం.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాలో గతంలో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Key Points

1

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో ఫుల్ బిజీగా జరుగుతోంది.

2

గతంలో రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 'పెద్ది'లో అవకాశం లభించింది.

4

'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్, భారీ అంచనాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ (peddi)సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. పలు ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ చేస్తున్నారు. బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా, ‘పెద్ది’ కోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రామ్ చరణ్‌కు స్టెప్పులు నేర్చించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ ఫొటో కూడా షేర్ చేశారు. ఇక ఈ పిక్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన నిందితుడికి ఇలాంటి చాన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని బుచ్చిబాబు ఇలా చేశాడంటూ ఫైర్ అవుతున్నారు. చట్టం ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తికి పెద్ద హీరో సినిమాలో చాన్స్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. కాగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్, ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా… ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు టాక్. link

రేప్ కేసు నిందితుడికి అవకాశం: నెటిజన్ల ఆగ్రహం

‘పెద్ది’ చిత్రంలో కీలక పాత్రలు, విడుదల వివరాలు

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చే సంక్రాంతికి రాబోతుంది. వివాదాల నడుమ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ వివాదం సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.