
📌 Key Points
- ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- హీరోయిన్ అనస్వర రాజన్‌కు అద్భుత భవిష్యత్తు ఉంటుందని చరణ్ అంచనా వేశారు.
- మలయాళీ అయినా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడంపై చరణ్ ప్రశంసించారు.
- అనస్వర, రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాకు వీరాభిమాని అని వెల్లడించింది.
ఛాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ అనస్వర రాజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్‌లో ఆమె భవిష్యత్తుపై చరణ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఛాంపియన్ లాంచ్‌లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథి
Ram Charan : ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్ ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రాను తరుణంలో చిత్ర యూనిట్ నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రోషన్ గురించి అలానే నిర్మాత అశ్విని దత్ గురించి అద్భుతంగా మాట్లాడారు రాంచరణ్.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అనస్వర గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మలయాళం సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది అనుస్వర. మొత్తానికి ఛాంపియన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది.
రామ్ చరణ్ అనస్వర గురించి మాట్లాడుతూ కీలక విషయాలను తెలిపారు. మీ ఫేస్ చాలా కళ గా ఉంది. మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్నింటిని మించి చాలామంది దర్శక నిర్మాతలు మీ డేట్లు కోసం ఖచ్చితంగా పోటీ పడతారు అంటూ చరణ్ చెప్పాడు.
అనస్వర అంకితభావంపై చరణ్ ప్రశంసలు
ఈరోజుల్లో చాలామంది హీరోయిన్లు వాళ్ల పాత్రలకు డబ్బింగ్ చెప్పడం తగ్గించేశారు. కానీ ప్రియాంక కొద్దిసేపటి క్రితమే మీ గురించి చెప్పారు మీరు మలయాళం అయినా కూడా తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పారు అని తెలిసింది. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ అనస్వర రాజన్ గురించి చరణ్ తేజ మాట్లాడారు.
రామ్ చరణ్ కెరియర్ లో మగధీర సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది చరణ్ కు రెండువ సినిమా అయినా కూడా అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అవార్డులు అన్నిటిని కూడా తిరగరాసింది. లేకపోతే అనస్వర రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ నాకు మగధీర సినిమా చాలా ఇష్టమని, ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు అంటూ చెప్పింది.
టాలీవుడ్‌లో అనస్వర భవిష్యత్తుపై చరణ్ జోస్యం
ఇకపోతే గతంలో చాలామంది మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ కు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇకపోతే చాంపియన్ సినిమా ఆకట్టుకునే దానిని బట్టి అనస్వర కి కూడా తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది సాంగ్ చూసి ఫిదా అయిపోయారు. పర్ఫామెన్స్ తో పాటు డాన్స్ లో ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తానికి ఒక హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ తనకి ఉన్నాయి అని అర్థం అవుతుంది. అలానే విపరీతమైన డెడికేషన్ ఉండటం కూడా ఎక్స్ట్రా బ్యూటీ.
మొత్తానికి, రామ్ చరణ్ మద్దతు, అనస్వర అంకితభావం ఆమెను టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన స్థానానికి తీసుకెళ్లగలవు. ‘ఛాంపియన్’ విజయం ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని ఆశిద్దాం.


