
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రాణించిన రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగార్జున శివ సినిమా నిర్మాణ సమయంలో, మోహన్ బాబుకు ఒక పాత్ర ఇవ్వాలని నిర్మాత అక్కినేని వెంకట్ సూచించినా, ఆర్జీవీ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Key Points
ఆర్జీవీ శివ సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
గణేష్ పాత్ర కోసం మోహన్ బాబును తీసుకోవాలని సూచించినా, రామ్ గోపాల్ వర్మ తిరస్కరించారు.
శివ సినిమా నిర్మాత, నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపారు.
కొత్త నటుడితోనే ఆ పాత్ర పర్ఫెక్ట్ ఉంటుందని వర్మ భావించారు, అదే జరిగింది.
శివ సినిమాలో మోహన్ బాబు పాత్ర తిరస్కరణ
Ram Gopal Varma : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా సినిమాలు చేసి తెలుగు, హిందీ ప్రేక్షకులను మెప్పించిన ఆర్జీవీ ఇప్పుడు తన ఇష్టం అంటూ తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నాడు. ఆర్జీవీ నాగార్జున శివ సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివ సినిమా భారీ విజయం సాధించి ఫిలిం మేకింగ్ లో సరికొత్త ప్రయోగాలను తెరపైకి తీసుకొచ్చింది.
శివ సినిమాని 4K చేసి నవంబర్ 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో అప్పుడు శివ సినిమాకు పనిచేసినవాళ్లు, శివ సినిమాని చూసిన సెలబ్రిటీలతో ఆ సినిమా గురించి మాట్లాడిస్తున్నారు. తాజాగా శివ సినిమా నిర్మాత, నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపారు.
ఆర్జీవీ నిర్ణయం – కొత్త నటుడి ఎంపిక
అక్కినేని వెంకట్ మాట్లాడుతూ.. శివ సినిమా స్క్రిప్ట్ చర్చల్లో నేను కూడా పాల్గొన్నాను. నేను కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చినా ఆర్జీవీ తిరస్కరించాడు. ఒక పాత్ర కోసం మోహన్ బాబుని తీసుకోవాలని అనుకున్నాను. సినిమాలో విలన్ భవాని పాత్ర పక్కన ఉండే గణేష్ పాత్రకి మోహన్ బాబుని తీసుకుందాం అనుకున్నా. ఆర్జీవీకి మోహన్ బాబుని ఆ పాత్ర కోసం తీసుకొమ్మని చెప్పాను. మోహన్ బాబు చేస్తే కాస్టింగ్ పరంగా, బిజినెస్ పరంగా కూడా బెనిఫిట్ అవుతుంది భావించాను. కానీ వర్మ మాత్రం ఆ పాత్రకు మోహన్ బాబు అస్సలు వద్దు అన్నాడు. కొత్తవాళ్లు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని చెప్పాడు. వర్మ అనుకున్నట్టే గణేష్ పాత్రకు కొత్త నటుడ్ని తీసుకొచ్చాడు. సినిమాలో ఆ నటుడు బాగానే సెట్ అయ్యాడు అని తెలిపారు.
శివ సినిమాలో విలన్ భవాని పక్కన ఉండే పాత్రల్లో గణేష్ ఒకటి. సినిమా అంతా ఈ పాత్ర ఉంటుంది. భవానికి, శివ కి మధ్యలో ఈ పాత్ర తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి పాత్రలో విశ్వనాధ్ అనే కొత్త నటుడు చేసాడు. అప్పటికే మోహన్ బాబు విలన్ పాత్రలు వేస్తూ బిజీగా ఉన్నారు. శివ వచ్చిన 25 ఏళ్ళ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలో రౌడీ అనే ఓ సినిమాలో మోహన్ బాబు నటించారు.
అక్కినేని వెంకట్ వెల్లడించిన ఆసక్తికర విషయం
గణేష్ పాత్రలో మోహన్ బాబు బదులు నటించిన నటుడు విశ్వనాధ్ ఇతనే..
రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా శివలోనే తన పట్టుదలను, దర్శకుడిగా తన విజన్ ను చూపించారని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. మోహన్ బాబు వంటి స్టార్ నటుడిని కాదని కొత్త నటుడితో ఆ పాత్రను చేయించడం ఆయన ధైర్యానికి నిదర్శనం.


