|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Gopal Varma: మీరంతా సిగ్గు తెచ్చుకోవాలి.. అసలు అతను యాక్టరా, డైరెక్టరా?.. కాంతార సినిమాపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్

Published: 04-10-2025, 11:32 AM
Ram Gopal Varma: మీరంతా సిగ్గు తెచ్చుకోవాలి.. అసలు అతను యాక్టరా, డైరెక్టరా?.. కాంతార సినిమాపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ‘కాంతార’ చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాపై సినీ తారలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కాంతార’పై షాకింగ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Key Points

1

కాంతార 2వ రోజుకు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

2

NTR, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్స్ కాంతారను ప్రశంసించారు.

4

రిషబ్ శెట్టి యాక్టరా, డైరెక్టరా అని తేల్చుకోలేకపోతున్నానని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

కాంతార సినిమా బాక్సాఫీస్ విజయం

Ram Gopal Varma: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంతార ఛాప్టర్ 1. బ్లాక్ బస్టర్ కాంతార కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. అలాగే.. జయరాం, గుల్షన్ దేవయ్య లాంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తరువాత కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుస్తోంది కాంతార.

Janhvi Kapoor: మా స్టార్ కిడ్స్ కష్టాలు ఎవరూ పట్టించుకోరు.. చెప్పినా వినరు.. ఇన్‌సైడర్ vs అవుట్‌సైడర్‌ లో జాన్వీ కపూర్

రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్

ఇక మొదటిరోజు ఏకంగా రూ.89 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం రెండురోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా స్టార్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్టీఆర్, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో మరో స్టార్ చేరిపోయాడు. ఆ స్టార్ మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

రిషబ్ శెట్టిపై ఆర్జీవీ ప్రశంసలు

రీసెంట్ గా సినిమా చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. “కాంతార సినిమా ఒక అద్భుతం. దేశంలోని ప్రతీ నిర్మాత రిషబ్ శెట్టి, అతడి టీమ్‌ని చూసి సిగ్గుపడాలి. సినిమాలోని కంటెంట్‌, వారి కష్టమే ఈ చిత్రాన్ని బ్లాక్‌ బస్టర్‌ అయ్యేలా చేసింది. సినిమా విషయంలో ఎక్కడ కూడా రాజీపడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబలే ఫిల్మ్స్‌ని తప్పకుండా అభినందించి తీరాలి. రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా.. గొప్ప డైరెక్టరా? అనేది తేల్చుకోలేకపోతున్నాను”అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

కాంతార సినిమా విజయంపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. రిషబ్ శెట్టి అభినయానికి, దర్శకత్వానికి ఆర్జీవీ ముగ్ధుడయ్యారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.