|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెస్ట్ డైరెక్టర్ నువ్వా రాజమౌళీనా.. సందీప్ రెడ్డి వంగా ఆన్సర్‌కు రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఇదే.. పంచ్‌లు, ట్విస్టులతో!

Published: 04-09-2025, 10:10 AM
బెస్ట్ డైరెక్టర్ నువ్వా రాజమౌళీనా.. సందీప్ రెడ్డి వంగా ఆన్సర్‌కు రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఇదే.. పంచ్‌లు, ట్విస్టులతో!

జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించే జయమ్ము నిశ్చయమ్మురా షోలో రామ్ గోపాల్ వర్మ మరియు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. వారి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది. రాజమౌళి గురించి వారు చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Key Points

1

జయమ్ము నిశ్చయమ్మురా షోలో ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగాల మధ్య సరదా సంభాషణ.

2

రాజమౌళి, సందీప్ రెడ్డిలలో ఎవరు ఉత్తమ దర్శకుడు అనే చర్చ.

4

జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను పకపక నవ్వించింది.

జయమ్ము నిశ్చయమ్మురా షోలో ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా

టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి. జీ తెలుగు, జీ5 ఓటీటీ అందిస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ , సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు.

దీనికి సంబంధించిన ప్రోమోలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో విడుదల చేసిన జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి ప్రోమోలో పంచ్‌లు ట్విస్టులు, నవ్వులతో చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. “జగపతి బాబు పేరు సాలిడ్‌గా రిజిస్టర్ అయింది గాయం సినిమాతో” అని జగపతి బాబు అంటే “నువ్వు నన్ను పొగిడినంత మాత్రాన నేను నిన్ను పొగడను” అని ఆర్జీవీ అన్నారు.

ఉత్తమ దర్శకుడు ఎవరు? ఆసక్తికర చర్చ

“నేను నిన్ను పొగడలా ఇప్పుడు” అని జగపతి బాబు అంటే.. “ఇది పొగడ్త కాదు అంటేనే అది పొగడ్త” అని కౌంటర్ వేశారు రామ్ గోపాల్ వర్మ. “ఊర్మిల ఫోర్ గ్రౌండ్‌లో ముందు ఉంది నేను వెనుక ఉన్న. రాము నేను ఏం చేయాలి అంటే.. నీ మొహం ఎవడు చూస్తాడు. నువ్వు ఏం చేస్తే ఏంటీ అన్నాడు” అని జగపతి చెప్పారు.

దాంతో సందీప్ రెడ్డి వంగా షాక్ అయ్యారు. “సందీప్ గాయం చూసేటప్పుడు జగపతి కోసం చూశావా, ఊర్మిల కోసం చూశావా” అని ఆర్జీవీ అడిగితే.. “నిజానికి మీకోసం చూశాను సర్” అని ట్విస్ట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. “ఏమైనా ఈయన నాకు టీచర్ సర్” అని సందీప్ రెడ్డి అంటే.. “సందీప్ లాంటి స్టూడెంట్ నాకుంటే టీచర్‌గా వదిలేసేవాన్ని అని ఆర్జీవీ చెప్పారు.

పంచ్‌లు, ట్విస్టులతో నిండిన ఎపిసోడ్

“రాజమౌళి, సందీప్ రెడ్డిలో ఎవరు బెటర్ డైరెక్టర్” అని ఆర్జీవీని జగపతి బాబు అడిగారు. ” రాజమౌళి బెటరా, నువ్వు బెటరా” అని సందీప్‌ రెడ్డిని ఆర్జీవీ అడిగారు. దాంతో సందీప్ రెడ్డి వంగా షాక్ అయ్యారు. అక్కడున్న వారంతా నవ్వేశారు. “కచ్చితంగా రాజమౌళి గారు ఎప్పుడు బెటర్” అని సందీప్ రెడ్డి వంగా సమాధానం ఇచ్చారు.

దానికి “అంటే నేను మరి అంత ఎధవలా కనపడుతున్నానా” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. దానికి జగపతి బాబుతో సహా ఆడియెన్స్ అందరూ తెగ నవ్వేశారు. “కాస్తా నీ ఇంటలిజెన్స్ పక్కన పెట్టు” అని జగపతి బాబు అంటే.. “నా చావు నేను చస్తా మీ బతుకు మీరు బతకండి” అని ఫినిషింగ్ ఇచ్చారు ఆర్జీవీ .

చివరగా, ఈ ఎపిసోడ్ రామ్ గోపాల్ వర్మ మరియు సందీప్ రెడ్డి వంగాల మధ్య సరదా సంభాషణతో ప్రేక్షకులను అలరించింది. రాజమౌళి గురించి వారి అభిప్రాయాలు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను పకపక నవ్వించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.