|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇదో కొత్త రకం గూండాయిజం: రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తర్వాత డిలీట్.. కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే అంటూ..

Published: 02-06-2025, 7:54 AM
ఇదో కొత్త రకం గూండాయిజం: రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తర్వాత డిలీట్.. కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే అంటూ..

కన్నడ భాషా వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ పై రామ్ గోపాల్ వర్మ చేసిన సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ రిలీజ్ అని అనుమతించరు అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించడాన్ని ఆయన ఖండించారు.

Key Points

1

రామ్ గోపాల్ వర్మ కమల్ హాసన్ కన్నడ భాషా వ్యాఖ్యలను 'కొత్త రకం గూండాయిజం' అని అభివర్ణించారు.

2

కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే 'థగ్ లైఫ్' సినిమా రిలీజ్ నిరోధించే బెదిరింపులను ఆర్జీవీ ఖండించారు.

4

కన్నడ సంఘాల వైఖరి, కమల్ హాసన్ ప్రతిస్పందన మరియు థగ్ లైఫ్ సినిమా రిలీజ్‌పై ఉద్రిక్తత నెలకొంది.

కమల్ హాసన్ కన్నడ భాషా వివాదం

రామ్‌గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు మారు పేరు. ఈ మధ్య సినిమాల కంటే తన ట్వీట్స్, కామెంట్స్ తోనే వార్తల్లో ఉంటున్నాడు. ఇక ఇప్పుడు కమల్ హాసన్ కన్నడ భాషా వివాదంపై స్పందించాడు. సోమవారం (జూన్ 2) అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదో కొత్త రకంగా గూండాయిజం అని వర్మ అంటున్నాడు.

ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తపరిచే రామ్ గోపాల్ వర్మ .. ఇప్పుడు కమల్ హాసన్ వివాదంపైనా తనదైన స్టైల్లో స్పందించాడు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని రిలీజ్ కానివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించడం ఓ కొత్త రకం గూండాయిజం అని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు.

రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

“ప్రజాస్వామ్యానికి కొత్త పేరు అసహనం. అందులోని నిజానిజాల సంగతిని పక్కన పెడితే కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో రిలీజ్ చేయనిస్తామన్నది ఓ కొత్త రకం గూండాయిజమే అవుతుంది” అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కాసేపటికే అతడు డిలీట్ చేయడం గమనార్హం.

కమల్ హాసన్ , మణిరత్నం కాంబినేషన్లో ఈ నెల 5న థగ్ లైఫ్ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కన్నడ భాషపై కమల్ స్పందిస్తూ.. అది తమిళ భాష నుంచి పుట్టినదే అని అన్నాడు. దీనిపై కన్నడ సంఘాలు, కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా మండిపడ్డాయి.

థగ్ లైఫ్ సినిమా రిలీజ్‌పై ఉద్రిక్తత

కమల్ వెంటనే క్షమాపణ చెబితేనే అతని థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయనిస్తామని, లేదంటే నిషేధిస్తామని హెచ్చరించాయి. అయినా కమల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతానని, తానే తప్పూ చేయలేదని అన్నాడు. అంతేకాదు థగ్ లైఫ్ మూవీ నిషేధం బెదిరింపులపై కర్ణాటక హైకోర్టును అతడు ఆశ్రయించాడు. మరో మూడు రోజుల్లోనే మూవీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఈ సమస్య ఎంత వరకూ వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

కమల్ హాసన్ క్షమాపణ విషయం, కన్నడ సంఘాల వైఖరి, మరియు థగ్ లైఫ్ సినిమా భవిష్యత్తు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.