|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Published: 21-08-2025, 7:17 AM
రామ్ కొత్త సినిమా 'ఆంధ్ర కింగ్ తాలుకా'.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

స్కంద, డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ క్లాస్ సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలుకా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించబడింది.

Key Points

1

రామ్ కొత్త సినిమా 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ డేట్ నవంబర్ 28.

2

సినిమా రిలీజ్ తేదీకి 'రాజాసాబ్' సినిమాతో పోటీ.

4

కలెక్షన్ల పరంగా సినిమాకు సవాళ్లు ఎదురవుతాయేమోనని అనుమానాలు.

‘ఆంధ్ర కింగ్ తాలుకా’ రిలీజ్ డేట్ ప్రకటన

స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న హీరో రామ్.. మాస్ పక్కనబెట్టేశాడు. క్లాస్ సినిమా చేశాడు. అదే ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్. ఇదివరకే ఓ మెలోడీ పాట రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రిలీజ్ తేదీని ప్రకటించారు.

ఈ ఏడాది ఇప్పటికే చాలావరకు సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో రవితేజ ‘మాస్ జాతర’, తేజ సజ్జా ‘మిరాయ్’, అనుష్క ‘ఘాటీ’,  పవన్ కల్యాణ్ ‘ఓజీ’, రిషభ్ శెట్టి ‘కాంతార’ తదితర చిత్రాలు రాబోతున్నాయి. డిసెంబరులో ‘రాజాసాబ్’ లైనులో ఉంది. దీంతో కొత్త సినిమాలొచ్చినా సరే అన్ సీజన్‌లోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చిత్రం కూడా నవంబర్ 28న షెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

బాక్స్ ఆఫీస్ పోటీ

అయితే ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమాకు చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇదొచ్చిన వారానికి ‘రాజాసాబ్’ రిలీజ్ కానుంది. ఒకవేళ ఇది సంక్రాంతికి వాయిదా పడినా, అదే తేదీకి ‘అఖండ 2’ రావొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రెండింటిలో ఏది రిలీజైనా సరే రామ్ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండొచ్చు.

రామ్-భాగ్యశ్రీ ప్రేమ వ్యవహారం

‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రం హీరోలని అభిమానించే ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు. ఇందులో భాగ్య శ్రీ హీరోయిన్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే రామ్-భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

చివరగా, ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం. అయితే, పోటీ సినిమాలతో పాటు, ప్రేమ వ్యవహారం వార్తల ప్రభావం కూడా సినిమా విజయంపై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.