
యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో తన ప్రేమకథలను పంచుకున్నారు. హీరోయిన్స్‌తో సంబంధాలపై జగపతి బాబు అడిగిన సరదా ప్రశ్నలకు రామ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఆయన చేసిన చిలిపి పనులు, వెంట తిప్పుకున్న అమ్మాయిల గురించి వెల్లడించారు.
Key Points
రామ్ పోతినేని జగపతి బాబు హోస్ట్ చేసిన 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోకి హాజరయ్యారు.
జగపతి బాబు అడిగిన ప్రేమ, ఎఫైర్ ప్రశ్నలకు రామ్ పోతినేని ఆసక్తికర సమాధానాలిచ్చారు.
తాను అమ్మాయిలను వెంట తిప్పుకున్నానని, ప్రేమకథలు ఉన్నాయని రామ్ వెల్లడించారు.
రామ్ నటించిన 'ఆంధ్రకింగ్ తాలూకా' సినిమా నవంబర్ 28న విడుదల కానుంది.
రామ్ ప్రేమకథ.. వెంటతిప్పుకున్న అమ్మాయిలు
Ram Pothineni: యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ఆంధ్రకింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ట్యాగ్ లైన్. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీ రోల్ లో కనిపిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న(Ram Pothineni) ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు టీం. ఇందులో భాగంగానే సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి హాజరయ్యాడు హీరో రామ్.
Sai Durgha Tej: బ్రో తరువాత బ్యాడ్ టైం.. రెండు సినిమాలు క్యాన్సిల్.. ఈ సినిమా చాలా కీలకం..
జగపతి బాబు చిలిపి ప్రశ్నలు
ఈ షోలో రామ్ ని ఆటపట్టించే ప్రశ్నలు అడిగాడు జగపతి బాబు… నువ్వు అపార్ట్మెంట్ లో సోలోగా ఉంటున్నావ్ అంటే ఎఫైర్ గ్యారెంటీ ఉండే ఉంటుంది. కొద్దికొద్దిగా వినిపిస్తున్నాయి.. అంటూ అడిగాడు. దానికి సమాధానంగా రామ్.. “లవ్ అనండి ఓకే.. మరీ ఎఫైర్ ఏంటి సార్” అని నవ్వుతు అన్నాడు. ఆ తరువాత తాను చేసిన చిలిపి పనులు చెప్పిన రామ్.. ఒక్క అమ్మాయిని పడేయడానికి చాలా కష్టాలు పడ్డాడని, చాలామంది అమ్మాయిలను వెంట తిప్పుకున్నట్లు చెప్పాడు. దానికి జగపతిబాబు.. హీరోయిన్లతో బాగా ఆడుకున్నావ్.. అని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
‘ఆంధ్రకింగ్ తాలూకా’.. రామ్ ఆశలు
ఇక ఆంధ్రకింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా విజయం రామ్ కి చాలా కీలకం. ఎందుకంటే, ఆయన చేసిన గత సినిమాలు రెడ్, డబుల్ ఇష్మార్ట్, స్కంద సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే, ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు రామ్. మరి ఈ సినిమా రామ్ కి ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుంది అనేది చూడాలి.
ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా, రామ్ తదుపరి చిత్రం ‘ఆంధ్రకింగ్ తాలూకా’ నవంబర్ 28న విడుదల కానుంది. గత చిత్రాల నిరాశ తర్వాత ఈ సినిమా విజయం రామ్ కి చాలా కీలకం. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.


