|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ మూవీ బడ్జెట్ రూ.4 వేల కోట్లు.. ఇండియాలోనే హైయ్యస్ట్.. రెండు పార్ట్ లుగా సినిమా.. ఎపిక్ కథతో బిగ్గెస్ట్ ఫిల్మ్

Published: 15-07-2025, 8:57 AM
ఆ మూవీ బడ్జెట్ రూ.4 వేల కోట్లు.. ఇండియాలోనే హైయ్యస్ట్.. రెండు పార్ట్ లుగా సినిమా.. ఎపిక్ కథతో బిగ్గెస్ట్ ఫిల్మ్

బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా రేంజ్ పెరిగింది. ఇప్పుడు రామాయణం సినిమా రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రెండు పార్ట్లుగా విడుదల కానున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

Key Points

1

రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణం సినిమా నిర్మాణం.

2

రెండు పార్ట్లలో విడుదల కానున్న ఈ మహా సినిమా.

4

ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది.

రూ.4000 కోట్ల భారీ బడ్జెట్

బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి మాత్రమే కాదు ఏకంగా ఇండియన్ మూవీ రేంజ్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేందుకు ప్రోడ్యూసర్లు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అలవోకగా రూ.1000 కోట్ల వరకూ పెడుతున్నారు. కానీ ఈ ఎపిక్ సినిమా కోసం ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం మతి పోగొట్టేదే. ఆ మూవీ.. ‘రామాయణ’. ఎపిక్ కథను సినిమాగా తీసుకురావడం కోసం రామాయణ మూవీ రెండు పార్టులపై ప్రొడ్యూసర్లు పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.4 వేల కోట్లు.

రామాయణ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. ఇది అబద్దం కాదు.. పచ్చి నిజం. ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాయణ సినిమా బడ్జెట్ వివరాలు వెల్లడించారు.

రెండు పార్ట్లలో రామాయణం

‘‘పార్ట్ 1, 2 కలిపి మేం కంప్లీట్ చేసే సమయానికి బడ్జెట్ 500 మిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకుంటుంది. అంటే సుమారు రూ.4 వేల కోట్లు. గ్రేటెస్ట్ స్టోరీతో ప్రపంచంలోనే లార్జెస్ట్ సినిమా చేస్తున్నాం. ఈ ఎపిక్ కథను ప్రపంచం చూడాలి. అయితే ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే ఇది తక్కువే. తక్కువ ఖర్చుతోనే పెద్ద సినిమా తీస్తున్నామని అనుకుంటున్నా. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు’’ అని నమిత్ పేర్కొన్నారు.

రామాయణ సినిమా బడ్జెట్ అవతార్ పార్ట్ 1 కంటే ఎంతో ఎక్కువ. అవతార్ సినిమా కోసం కేవలం రూ.23.7 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. రామాయణ సినిమా కోసం ఏకంగా రూ.4 వేల కోట్లు స్పెండ్ చేస్తున్నారు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ బడ్జెట్ రూ.1000 కోట్లు.

నటీనటుల వివరాలు మరియు విడుదల తేదీలు

నితేశ్ తివారీ డైరెక్షన్ లో రెడీ అవుతున్న రామాయణ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, జపనీస్, మాండరీన్, స్పానిష్ తదితర భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయనుంది.

రామాయణ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా పార్ట్ 1ను 2026 దీపావళికి, పార్ట్ 2ను 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పార్ట్ 1 సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి.

రామాయణం సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం. దీని భారీ బడ్జెట్ మరియు ప్రపంచవ్యాప్త విడుదల ఈ సినిమాకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.