|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rana Daggubati: కమల్‌ ‘కన్నడ’ వివాదం.. ఏది మాట్లాడినా వివాదమే..

Published: 05-06-2025, 4:51 AM
Rana Daggubati: కమల్‌ 'కన్నడ' వివాదం.. ఏది మాట్లాడినా వివాదమే..

కమల్ హాసన్ చేసిన ‘కన్నడ’ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆయన సినిమాకు నిషేధం విధించింది. ఈ వివాదంపై రానా దగ్గుబాటి తన అభిప్రాయాలను వెల్లడించారు.

Key Points

1

కమల్ హాసన్ 'కన్నడ' వ్యాఖ్యలపై వివాదం రేగింది.

2

కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమాకు నిషేధం విధించింది.

4

రానా నాయుడు సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

కమల్ హాసన్ వ్యాఖ్యలపై వివాదం

‘తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది’ అని కమల్‌ హాసన్‌ ( Kamal Haasan ) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మా భాషను తక్కువ చేసి మాట్లాడతావా? అని ఆయన నటించిన థగ్‌ లైఫ్‌ సినిమా ( Thug Life Movie )పై కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కేఎఫ్‌సీసీ) నిషేధం ప్రకటించింది. అప్పటికీ కమల్‌ వెనక్కుతగ్గలేదు. తన సినిమా కర్ణాటకలో రిలీజ్‌ చేయాలని కోర్టుకెళ్లాడు. అసలు ఏ ఆధారంతో అటువంటి కామెంట్లు చేశారు? సారీ చెప్తే అయిపోతుందిగా అని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.

కర్ణాటక ఫిలిం ఛాంబర్ నిర్ణయం

ఏది మాట్లాడినా వివాదమే.. అప్పటికీ కమల్‌ క్షమాపణ చెప్పడం కాదుకదా.. అసలు కర్ణాటకలో సినిమా విడుదల చేయట్లేదని ప్రకటించాడు. తాజాగా ఈ వ్యవహారం హీరో రానా దగ్గుబాటి ( Rana Daggubati )కి వద్ద ప్రస్తావనకు వచ్చింది. రానా నాయుడు- రెండో సీజన్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో కమల్‌- కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి రానా మాట్లాడుతూ.. అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్‌ఫామ్‌గా సోషల్‌ మీడియా మారిపోయింది. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రతీది రాజకీయం చేస్తున్నారు అన్నాడు. ఇకపోతే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు రెండో సీజన్‌ జూన్‌ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

రానా దగ్గుబాటి అభిప్రాయాలు

కమల్ హాసన్ వ్యాఖ్యలు, కర్ణాటకలోని ప్రతిచర్య, మరియు సోషల్ మీడియాలో వివాదాల పెరుగుదల గురించి రానా దగ్గుబాటి చర్చించారు. ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.