
బాహుబలి సినిమా తన విజయంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చింది. తాజాగా, బాహుబలి చిత్రంపై ఓ నెటిజన్ ప్రశ్నకు రానా దగ్గుబాటి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Key Points
నెటిజన్ 'కట్టప్ప బాహుబలిని చంపకపోతే?' అని ప్రశ్నించాడు.
రానా, కట్టప్ప చంపకపోతే తాను బాహుబలిని చంపేవాడినని సమాధానం ఇచ్చాడు.
బాహుబలి: ది ఎపిక్ అక్టోబర్ 31న విడుదల కానుంది.
నెటిజన్ ప్రశ్నకు రానా సమాధానం
తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన దర్శదధీరుడు రాజమౌళిదే . ఆయన డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు ప్రపంచస్థాయిలో మనసత్తా చాటాయి . ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ గెలుపుతో మరోసారి వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా పేరు వినిపించేలా చేసింది . ఇంత ఘనత తీసుకొచ్చిన రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’( Baahubali: The Epic) పేరుతో మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల రాబోతుందని రాజమౌళి ప్రకటించారు . కాగా .. బాహుబలి చిత్రంలో ప్రభాస్ తో పాటు రానా కీలక పాత్రలో కనిపించారు .
రానా రిప్లై వైరల్
అయితే ఓ నెటిజన్ ప్రశ్నకు హీరో రానా ఇచ్చిన సమాధానం నెట్టింట తెగ వైరలవుతోంది . ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగి ఉండేదని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు . ఇది చూసిన హీరో రానా స్పందించాడు . కట్టప్ప ఆ పని చేయకపోతే .. నేను బాహుబలిని చంపేసేవాడినని రిప్లై ఇచ్చాడు . ఇది చూసిన ఫ్యాన్స్ భళ్లాల దేవ అంటూ కామెంట్స్ పెడుతున్నారు .
బాహుబలి: ది ఎపిక్ రిలీజ్
బాహుబలి విషయానికొస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం లిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.
రానా యొక్క సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా ప్రేక్షకులను మళ్ళీ ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.


