|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకటేష్‌ను బండబూతులు తిట్టిన రానా దగ్గుబాటి.. సెట్‌లో అలా చేశారంటూ ఆసక్తికర కామెంట్స్!

Published: 12-06-2025, 6:14 AM
వెంకటేష్‌ను బండబూతులు తిట్టిన రానా దగ్గుబాటి.. సెట్‌లో అలా చేశారంటూ ఆసక్తికర కామెంట్స్!

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి తన తాజా వెబ్ సిరీస్ ‘రానా నాయుడు-2’ షూటింగ్ అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇందులో ఆయన తన బాబాయ్ వెంకటేష్ తో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడాడు.

Key Points

1

రానా దగ్గుబాటి ‘రానా నాయుడు-2’ వెబ్ సిరీస్ షూటింగ్ గురించి మాట్లాడారు.

2

హిందీ డబ్బింగ్ సమయంలో వెంకటేష్‌ను తిట్టినట్లు అనిపించిందని రానా వెల్లడించారు.

4

వెంకటేష్ తో కలిసి పనిచేయడం గురించి రానా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)అందరికీ సుపరిచితమే. ఆయన వెంకటేష్ అన్న నిర్మాత సురేష్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. హీరోగా, విలన్‌గా నటించిన ఆయన పలు ఈవెంట్లకు, అవార్డు ఫంక్షన్లకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ‘రానా నాయుడు-2’ (Rana Naidu-2)వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ‘రానా నాయుడు’ సీక్వెల్‌గా రాబోతుండగా.. ఇందులో క్రితి కర్బందా, సుర్వీన్ చావ్లా(Surveen Chawla), సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee), అశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.

‘రానా నాయుడు-2’ షూటింగ్ అనుభవాలు

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నాకు హిందీ భాషలో కొన్ని పదాలకు సరైన అర్థం తెలియదు. అయితే ‘రానా నాయుడు’ కోసం హిందీ డబ్బింగ్ చెబుతున్నప్పుడు వాటిని కేవలం డైలాగ్స్ గానే చూశాను. బాబాయ్ వెంకటేష్‌ను తిడుతున్నానని అనుకోలేదు. కానీ తెలుగులో డబ్బింగ్ చెబుతున్న సమయంలో మాత్రం చాలా ఇబ్బందిపడ్డా. కొన్ని డైలాగ్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఈ సమయంలోనే నటీనటులు కొన్ని పాత్రలు చేస్తున్న సమయంలో ఇలాంటికి చేయక తప్పదని అర్థం చేసుకున్నాను.

వెంకటేష్‌తో రానా అనుబంధం

అయితే నటుడిగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం బాబాయ్‌తో నటించాలని కలలు కన్నాను. ఇప్పుడు ‘రానా నాయుడు’ సిరీస్ వల్ల నా కల నెరవేరింది. గతంలో ఇలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. ఆయన మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. సెట్‌లో నన్ను నేను మెరుగుపరుచుకునేలా బాబాయ్ నాకు సహాయం చేశారు. బాబాయ్‌తో ఉన్న ఆ క్షణాలే వేరు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రానా దగ్గుబాటి ‘రానా నాయుడు-2’ సిరీస్ షూటింగ్ విశేషాలను, వెంకటేష్ తో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.