|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెట్టింగ్ యాప్ కేసులో CID విచారణకు హాజరైన నటుడు రానా, విష్ణు ప్రియ.. ఆదాయంపై ఆరా!

Published: 15-11-2025, 6:00 AM
బెట్టింగ్ యాప్ కేసులో CID విచారణకు హాజరైన నటుడు రానా, విష్ణు ప్రియ.. ఆదాయంపై ఆరా!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ CID విచారణకు హాజరయ్యారు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించారు.

Key Points

1

నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణు ప్రియ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణకు హాజరయ్యారు.

2

విష్ణు ప్రియ మూడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించారు, బ్యాంక్ వివరాలు సమర్పించారు.

4

ఈ కేసులో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి.

రానా, విష్ణు ప్రియ CID విచారణకు హాజరు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించి స్టేట్‌మెంట్‌ తీసుకున్న సీఐడీ.. ఇవాళ (శనివారం) సీఐడీ కార్యాలయంలో వీరి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాంకర్ విష్ణు ప్రియ మూడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు అధికారుల సమాచారం. బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను విష్ణు ప్రియ CID సిట్ కి అందజేసినట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై సిట్ ఆరా తీసినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా వచ్చిన ఆదాయంపై CID సిట్ విచారణ చేస్తోంది.

కాగా, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్‌కు చెందిన మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖీలపై కేసు నమోదు చేయగా నటుడు ప్రకాశ్ రాజ్ రెండు రోజుల క్రితం సిట్ ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా బెట్టింగ్ యాప్స్ కేసుపై సిట్ విచారణ చేపట్టారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్: ఆదాయంపై ఆరా

29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలపై కేసులు

ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో మొత్తం 29 మంది సినీ ప్రముఖులపై కేసులు నమోదు కావడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. కేసు విచారణ కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.