
రానా దగ్గుబాటి నిర్మించిన ‘డార్క్ చాక్లెట్’ టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. బూతు డైలాగ్స్‌తో ‘A’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా పెద్దల కోసం తెరకెక్కింది. రానా ఇలాంటి చిత్రం చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Key Points
రానా దగ్గుబాటి నిర్మిస్తున్న 'డార్క్ చాక్లెట్' సినిమా టీజర్ విడుదలైంది.
ఈ చిత్రంలో బూతు డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో 'A' సర్టిఫికెట్ పొందింది.
యజ్ఞ, ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
రానా ఇలాంటి వివాదాస్పద చిత్రాన్ని నిర్మించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘డార్క్ చాక్లెట్’ టీజర్ హైలైట్స్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వరుస సినిమాలతో హిట్ అందుకుంటూ నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి నిర్మాణంలో ‘డార్క్ చాక్లెట్’(Dark chocolate) రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇక ఇందులో యజ్ఞ అనే అబ్బాయి, ఓ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథే ఈ చిత్రం. కానీ ఇందులో అన్ని బూతు డైలాగ్స్ ఉండటం గమనార్హం. కొన్నింటిని సెన్సార్‌లో కట్ చేసినప్పటికీ చాలా దారుణమైన బూతులు ఉన్నాయి.
రానా నిర్మాణంలో వివాదాస్పద చిత్రం
‘ఏ’ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా కేవలం పెద్దల కోసమే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక టీజర్ చివర్లో అక్టోబర్ 31, నవంబర్ 14, డిసెంబర్ 5 ఈ మూడు తేదీల్లో ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయమంటారో ప్రేక్షకులను ఎంచుకోమన్నారు. ఇక ఈ టీజర్ చూసిన నెటిజన్లు రానా ఇలాంటి చిత్రాన్ని నిర్మిస్తాడని అస్సలు ఊహించలేదంటూ షాక్ అవుతున్నారు. ‘జానర్ అడగొద్దు మాకూడా తెలియదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతుండగా.. విశ్వ దేవ్(Vishva Dev), బింధు మాధవి జంటగా నటిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
నెటిజన్ల ఆశ్చర్యకర స్పందన
A post shared by Spirit Media (@thespiritmedia)
వివాదాస్పద అంశాలతో కూడిన ‘డార్క్ చాక్లెట్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్సుకత నెలకొంది. రానా దగ్గుబాటి ఈ ప్రయోగాత్మక చిత్రంతో నిర్మాతగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.


