|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rana Naidu Teaser: రానా నాయుడు సీజన్‌-2.. టీజర్ వచ్చేసింది

Published: 21-05-2025, 11:45 AM
Rana Naidu Teaser: రానా నాయుడు సీజన్‌-2.. టీజర్ వచ్చేసింది

విజయవంతమైన రానా నాయుడు వెబ్ సిరీస్‌కు సీజన్ 2 టీజర్ విడుదలైంది. విక్టరీ వెంకటేశ్ మరియు రానా దగ్గుబాటి నటించిన ఈ సిరీస్ జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అమెరికన్ సిరీస్ ‘రే డొనోవన్’ కు ఇది రీమేక్.

Key Points

1

రానా నాయుడు సీజన్ 2 టీజర్ విడుదల

2

జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం

4

అమెరికన్ సిరీస్ రే డొనోవన్ రీమేక్

సీజన్ 2 టీజర్ రిలీజ్

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్‌ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించారు. కాగా.. సీజన్‌-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్‌-2ను కూడా తెరకెక్కించారు.

నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్

తాజాగా రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో రానా సందడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌కు విచ్చేసిన రానాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలతున్నాయి.

నటీనటులు మరియు సిరీస్ వివరాలు

కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. తాజాగా రిలీజైన రానా నాయుడు సీజన్-2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అమెరికన్‌ టీవీ సిరీస్‌ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు.

మొత్తానికి, రానా నాయుడు సీజన్ 2 టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.