
📌 Key Points
- రానా దగ్గుబాటి ‘అరణ్య’ షూటింగ్ సమయంలో అడవిలో మర్చిపోలేని సంఘటనను పంచుకున్నారు.
- ఏనుగులు సమీపిస్తుండగా టీమ్‌తో కలిసి మూడు గంటలు భయంతో దాక్కున్నారు.
- ఈ సంఘటన అడవిలోని ప్రమాదాన్ని మొదటిసారిగా రానాకు తెలియజేసింది.
- ప్రస్తుతం రానా ‘పరాశక్తి’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఇటీవల ఓ ఈవెంట్‌లో తన జీవితంలో మర్చిపోలేని భయంకర అనుభవాన్ని పంచుకున్నారు. ‘అరణ్య’ షూటింగ్ సమయంలో అడవిలో ఏనుగుల మధ్య మూడు గంటలపాటు భయంతో వణికిపోయాడని, ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుందని వెల్లడించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రానాకు ఏనుగుల భయంకర అనుభవం
రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. పలు సినిమా ఈవెంట్లకు గెస్ట్‌గా కూడా వస్తున్నారు. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రానా దగ్గుబాటి తన జీవితంలో మర్చిపోలేని సంఘటనను పంచుకున్నారు. ‘‘అరణ్య (aranya)షూటింగ్ సమయంలో మేము అడవిలో ఉండాల్సి వచ్చింది. కొన్ని సీన్స్ ఏనుగులు ఉండే ప్రాంతంలో షూట్ చేశాం. అయితే సాయంత్రం అయ్యే సమయానికి అందరూ వెళ్లిపోయేవారు. కానీ అనుకున్న టైమ్‌కి మా షూట్ పూర్తి కాకపోవంతో రాత్రి వరకు అక్కడే ఉన్నాం. నేను సీన్ చేస్తూ దూరంగా ఉన్నాను. ఆ సమయంలోనే అందరూ గబా గబా వెళ్లిపోతున్నారు. ఎందుకు ఏమైందని చూస్తే.. ఏనుగులు మా వైపుకు వస్తున్నాయి. దీంతో టీమ్ అంతా వాటికి కనిపించకుండా.. చెట్ల చాటుకు దాచుకున్నాం.
కొంచెం కూడా శబ్దం చేయకుండా చిమ్మ చికట్లో మూడు గంటలపాటు భయపడుతూ ఉన్నాం. ఈ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అడవి ఎంత భయకరంగా ఉంటుందో మొదటిసారి అర్థమైంది’’ అని చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రానా, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరణ్య’ చిత్రాన్ని ప్రభు సాల్మన్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2021లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. రానా సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘కాంత’తో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ‘పరాశక్తి’లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. శివ కార్తీకేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.
అరణ్య షూటింగ్‌లో భయానక ఘటన
రానా ప్రస్తుత, రాబోయే సినిమాలు
రానా పంచుకున్న ఈ భయంకర అనుభవం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నటనలో రాణిస్తూనే, ఇలాంటి వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది. ఆయన తదుపరి చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


