
📌 Key Points
- రణవీర్ సింగ్‌పై FWICE విధించిన నిషేధం ఎట్టకేలకు ఎత్తివేత, సినీ వర్గాల్లో హర్షం.
- ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతోనే ఈ వివాదం మొదలైంది, భారీ నష్టాలు.
- రణవీర్ కోర్టును ఆశ్రయించడంతో FWICE వెనక్కి తగ్గింది, లీగల్ నోటీసుల ప్రభావం.
- FWICE అధ్యక్షుడు బీఎన్ తివారీ అధికారిక ప్రకటన, భవిష్యత్తులో నిషేధాలు ఉండవని స్పష్టం.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అభిమానులకు ఓ అదిరిపోయే శుభవార్త! గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీని కుదిపేసిన ఆయనపై నిషేధం వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. FWICE తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
రణవీర్ Vs FWICE: వివాదం ఎక్కడిదాకా?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం FWICE నిషేధం విధించిన విషయం తెలిసిందే. డాన్-3 నుంచి ఆయన సడెన్‌గా తప్పుకోవడంతో నిర్మాతలకు కోట్లలో నష్టం వచ్చిందంటూ ఆరోపించిన సదరు సంస్థ రణవీర్‌పై నిషేదం విధించింది. తాజాగా ఈ వివాదంపై రణవీర్ కోర్టును ఆశ్రయించి FWICE సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే రణవీర్ సింగ్‌పై విధించిన నాన్ కో-ఆపరేషన్ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు FWICE (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ మేరకు FWICE చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్‌మేరకు అశోక్ పండిట్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణవీర్ కోరారు. ఈ అంశంపై చిత్ర బృందంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని రణవీర్‌కు విజ్ఞప్తి చేశాము. దీనిపై ఆయన నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాము. ఇక ఆండస్ట్రీలో ఎవరిపైనా నిషేధం విధించే హక్కు మాకు లేదు’ అంటూ స్పష్టం చేశారు. దీంతో కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రణవీర్ సింగ్ నిషేధం అంశంపై ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు అయింది.
బ్యాన్ ఎత్తివేత: FWICE షరతులు ఏం పెట్టారు?
డాన్ 3 భవిష్యత్తు: రణవీర్ నిర్ణయం ఏంటి?
రణవీర్ సింగ్, FWICE మధ్య నడిచిన ఈ హైడ్రామాకు తెరపడింది. ఈ పరిణామం బాలీవుడ్‌లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి!


