|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్‌ సింగ్‌కి షాక్! డాన్ 3 బ్యాన్ ఇష్యూపై FWICE సంచలన క్లారిటీ!

Published: 26-05-2026, 5:00 PM
రణ్‌వీర్‌ సింగ్‌కి షాక్! డాన్ 3 బ్యాన్ ఇష్యూపై FWICE సంచలన క్లారిటీ!
  • రణ్‌వీర్‌ సింగ్‌ డాన్ 3 నుంచి తప్పుకోవడంతో 45 కోట్ల నష్టం!
  • FWICE బ్యాన్ అంటూ వచ్చిన వార్తలపై అశోక్‌ పండిట్‌ క్లారిటీ.
  • అధికారిక బ్యాన్ లేదు, సమస్య తీరే వరకు సహకరించొద్దు అంటూ ఆదేశం.
  • రణ్‌వీర్‌ కెరీర్‌పై ఈ వివాదం ప్రభావం ఇప్పుడు ట్రెండింగ్ చర్చ.

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌ కెరీర్‌పై డాన్ 3 వివాదం పెను ప్రభావం చూపుతోంది! ఏకంగా బ్యాన్ వార్తలు గుప్పుమనడంతో అభిమానులు షాక్‌లో ఉన్నారు. FWICE చీఫ్ అడ్వైజర్ సంచలన వివరణతో ఈ వివాదం మరింత రసవత్తరంగా మారింది.

డాన్ 3 నుంచి రణ్‌వీర్‌ ఎందుకు తప్పుకున్నాడు?

Ranveer Singh : స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ధురంధర్‌ సిరీస్‌ పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ దగ్గర సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. చాలా కాలం సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తోన్న రణ్‌వీర్‌ ఈ సినిమాతోనే కెరీర్‌లో హైయ్యస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఈ రేంజ్‌ హిట్‌తో కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లోకి వెళ్తోన్న టైమ్‌లోనే డాన్‌ 3 మేకర్స్‌ నుంచి రణ్‌వీర్‌ సింగ్‌కి ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది.

ధురంధర్‌ రిలీజ్‌ కంటే ముందుగానే డాన్‌ 3 సినిమాకి ఓకే చెప్పారు రణ్‌వీర్‌. ఫర్హాన్‌ అక్తర్‌ డైరెక్ట్‌ చేసే ఈ బాలీవుడ్‌ సినిమా సీక్వెల్‌ నుంచి డాన్‌ 3 టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియో కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు రణవీర్ డాన్‌ 3 నుంచి తప్పుకోవడంతోనే అసలు సమస్య మొదలైంది. రణ్‌వీర్‌ సింగ్ సినిమా చేస్తారని ఇప్పటికే డాన్‌ 3 ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం 45 కోట్లు ఖర్చయినట్లు లీగల్‌ నోటీస్‌ రిలీజ్‌ చేశారు.

FWICE బ్యాన్ వెనుక అసలు నిజం ఏమిటి?

అలాగే ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ ప్రెస్ మీట్ పెట్టి రణవీర్ సింగ్ ని బాలీవుడ్ నుంచి బ్యాన్ చేసినట్టు ప్రకటించింది. దీంతో ఈ బాలీవుడ్‌ హీరోపై 3 ఇయర్స్‌ బ్యాన్‌ ప్రకటించింది FWICE (ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌) అని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్త బాలీవుడ్ లో చర్చగా మారింది. ఈ వార్త వైరల్ అవ్వడంతో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్‌ అడ్వైజర్‌, ఫిల్మ్‌మేకర్‌ అశోక్‌ పండిట్‌ దీనిపై వివరణ ఇచ్చారు.

రణ్‌వీర్‌ కెరీర్‌పై ఈ వివాదం ప్రభావం ఎంత?

అశోక్‌ పండిట్‌ మాట్లాడుతూ.. ఇది అధికారిక బ్యాన్‌ కాదు. నటులపై నిషేధం విధించే అధికారం మాకు లేదు. సమస్యకు పరిష్కారం లభించే వరకూ ఆయనతో కలిసి పనిచేయొద్దని మా సభ్యులను ఆదేశించాము. ఒక సినిమా నుంచి హీరోనే కాదు ఎవరు వెళ్ళిపోయినా నిర్మాతకే నష్టం అని అన్నారు. దీంతో రణవీర్ సింగ్ పై అధికారిక బ్యాన్ లేదు అని తెలుస్తుంది. మరి రణవీర్ నుంచి బాలీవుడ్ లో నెక్స్ట్ సినిమాలు వస్తాయా ? రావా చూడాలి.

రణ్‌వీర్‌ సింగ్‌ డాన్ 3 వివాదం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూపై తదుపరి అప్‌డేట్స్ కోసం వేచి చూడాలి. మరిన్ని సంచలన వార్తల కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.