|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ సింగ్ విధ్వంసం: హాలీవుడ్ స్థాయి యాక్షన్.. ‘ప్రళయ్’తో బాక్సాఫీస్ షేకింగ్!

Published: 03-04-2026, 2:35 AM
రణ్‌వీర్ సింగ్ విధ్వంసం: హాలీవుడ్ స్థాయి యాక్షన్.. ‘ప్రళయ్’తో బాక్సాఫీస్ షేకింగ్!
  • రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మూవీ రూ.1500 కోట్ల వసూళ్లు సాధించింది – సరికొత్త రికార్డు!
  • ‘డాన్ 3’ నుండి తప్పుకున్న రణ్‌వీర్ సింగ్ – ‘ప్రళయ్’తో రానున్నాడు, గ్లోబల్ మార్కెట్ టార్గెట్!
  • ‘ప్రళయ్’ మూవీ జాంబీ నేపధ్యంలో తెరకెక్కనుంది – హాలీవుడ్ యాక్షన్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు!
  • రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం – ఇండస్ట్రీ వర్గాల సమాచారం!

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ‘ధురంధర్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రణ్‌వీర్ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ‘ప్రళయ్’ అనే భారీ బడ్జెట్ మూవీతో రాబోతున్నాడు.

‘ధురంధర్’తో రికార్డులు క్రియేట్ చేసిన రణ్‌వీర్

Ranveer singh: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలో రణవీర్ కనబరిచిన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటనకు గాను ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘ధురంధర్ 2’ ఇప్పటికే రూ.1500 కోట్ల వసూళ్లను రాబట్టి, భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

జాంబీ నేపథ్యంలో ‘ప్రళయ్’ మూవీ.. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్!

దీంతో, రణవీర్ సింగ్ (Ranveer singh)తదుపరి సినిమాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన ‘డాన్ 3’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘డాన్ 3’ను పక్కన పెట్టి, రణవీర్ ఇప్పుడు ‘ప్రళయ్’ అనే భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నాడట. ఇది పూర్తిగా జాంబీ నేపథ్యంలో సాగే సినిమా అని, మునుపెన్నడూ చూడని రీతిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం.

భారీ బడ్జెట్‌తో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న రణ్‌వీర్

ఈ ‘ప్రళయ్’ చిత్రాన్ని కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉండబోతోందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌ టార్గెట్ గా చేసుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.

రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’ మూవీ గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అప్పటి వరకు వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.