
📌 Key Points
- సత్యదేవ్ కెరీర్‌లో సరికొత్త చిత్రం ‘రావు బహదూర్’.. పీరియడ్ డ్రామాతో ప్రేక్షకులకు వినోదం!
- మహేష్ బాబు, నమ్రత సమర్పణలో క్షీణిస్తున్న కులీన వర్గాల కథాంశం
- ఏప్రిల్ 15న ‘ఓ సుందరి’ పాట విడుదల..ప్రేమికులకు సంగీత విందు!
- 2026 సమ్మర్ లో ‘రావు బహదూర్’ విడుదల.. త్వరలో విడుదల తేదీ ప్రకటన!
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘రావు బహదూర్’ చిత్రం ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.
సత్యదేవ్ ‘రావు బహదూర్’ మూవీ అప్డేట్స్
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నలేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఫస్ట్ లుక్, టీజర్ ఆధారంగా ఇది ఒక విభిన్నమైన పీరియడ్ డ్రామా అని, సత్యదేవ్ తన కెరీర్‌లో డిఫరెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ కూల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘ప్రేమకు అంకితం, ప్రేమ నుండే పుట్టిన గీతం ‘ఓ సుందరి’.. ‘రావు బహదూర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ఓ సుందరి ఏప్రిల్ 15న విడుదలవుతోంది’ అని తెలిపారు. ఇక విడుదల చేసిన పోస్టర్‌లో హీరో అండ్ హీరోయిన్ లుక్ కూల్‌గా ఆకట్టుకుంటోంది. కాగా.. మహేష్ బాబు, నమ్రత సమర్పిస్తున్న ఈ చిత్రం క్షీణిస్తున్న కులీన వర్గాల నేపథ్యంతో సాగుతుంది. ఇందులో సత్యదేవ్‌తో పాటు దీప థామస్, ఆనంద్ భారతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2026 సమ్మర్ టార్గెటా ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. డేట్ త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
‘ఓ సుందరి’ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మహేష్ బాబు సమర్పణలో రావు బహదూర్!
రావు బహదూర్ చిత్రం కులీన వర్గాల నేపథ్యంతో వస్తుంది. సత్యదేవ్ నటన ఈ చిత్రానికి హైలైట్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


