|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rao Bahadur: ‘కింగ్డమ్’తో ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు ఇలా

Published: 12-08-2025, 3:43 AM
Rao Bahadur: 'కింగ్డమ్'తో ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు ఇలా

‘కింగ్డమ్’ సినిమాలో నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్, వెంకటేశ్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

Key Points

1

సత్యదేవ్ 'కింగ్డమ్' తర్వాత 'రావు బహదూర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు

2

వెంకటేశ్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ నటించనున్న 'రావు బహదూర్'

4

వచ్చే ఏడాది వేసవిలో 'రావు బహదూర్' సినిమా విడుదల

‘కింగ్డమ్’ తర్వాత సత్యదేవ్ కొత్త సినిమా

ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేశ్ బాబు.. ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు డీటైల్స్ బయటపెట్టారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా చాన్నాళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? హీరో ఎవరు?

‘రావు బహదూర్’ టైటిల్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్‌లో హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఇటీవలే ‘కింగ్డమ్’లోనూ హీరోకి సరిసమానంగా ఉండే నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు. దీనికి ‘రావు బహదూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు.

వచ్చే ఏడాది వేసవిలో విడుదల

సత్యదేవ్.. ‘రావు బహదూర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో డిఫరెంట్‌గా కనిపించాడు. చెప్పాలంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ముసలి రాజు గెటప్‌లో అస్సలు గుర్తుపట్టలేనట్లు ఉన్నాడు. ‘అనుమానం పెనుభూతం’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ తీస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. గతంలో సత్యదేవ్-వెంకటేశ్ మహా ‘ఉమామహేశ్‌వర ఉగ్రరూపశ్య’ అనే మూవీ చేశారు. కాకపోతే అది రీమేక్. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్‌తో వస్తున్నారు. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి?

‘రావు బహదూర్’ సినిమాతో సత్యదేవ్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వెంకటేశ్ మహా దర్శకత్వంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.