
📌 Key Points
- మీనాను ఓ స్టార్ హీరో బెదిరించినట్లు తాజాగా వెల్లడి.
- మోహన్ బాబు తనను సరదాగా బెదిరించేవారని మీనా వ్యాఖ్య.
- చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో తన అనుభవాలు పంచుకున్న మీనా.
- మీనా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.
మాజీ స్టార్ హీరోయిన్ మీనా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్టార్ హీరో తనను బెదిరించాడని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆ స్టార్ హీరో మోహన్ బాబు అని సరదాగా వెల్లడించిన మీనా వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మీనా షాకింగ్ కామెంట్స్ వెనుక అసలు నిజం
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించి ప్రస్తుతం అత్త, పిన్ని, అమ్మ,వదిన పాత్రలో మెప్పిస్తున్న వారిలో మీనా (Meena)ఒకరు. తెలుగులో తోప్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఒకప్పటి స్టార్స్‌తో నటించి ఎవర్ గ్రీన్ హీరోయిన్‌గా పాపులారిటీ దక్కించుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో బిజీ అయిపోయింది. ఈసమయంలోనే తన భర్త మరణించడంతో పూర్తిగా సినిమాలకు దూరం అయింది. కానీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, తనను ఓ స్టార్ హీరో బెదిరించాడని మీనా షాకింగ్ విషయాలు చెప్పింది.
నేను షూటింగ్‌లో చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరితో కలిసి నటించా.. అందరూ నాతో సరదాగా ఉండేవారని చెప్పింది. అలాగే బాలకృష్ణగారు సెట్‌లో అందరితో సరదాగా ఉంటారని.. కానీ మోహన్ బాబు(Mohan Babu) మాత్రం తనను బెదిరించేవాడని షాకింగ్ విషయం చెప్పింది.అందుకే ఆయనతో సినిమా చేసేటప్పుడు అస్సలు మాట్లాడేదాన్ని కాదని సరదాగా చెప్పింది. అంత సీరియస్‌గా కనిపించినప్పటికీ సరదాగా ఉండేవారని చెప్పింది. షూటింగ్ సమయంలో ఆయన పిల్లలతో ఆడుకున్నట్లు గుర్తు చేసుకుంది. ప్రస్తుతం మీనా కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అసలు మోహన్ బాబు ఏ విషయం గురించి మీనాను బెదిరించాడా? అని అంతా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మోహన్ బాబు బెదిరించాడా? మీనా వెల్లడి!
నాటి జ్ఞాపకాలు… ఇప్పుడు చర్చనీయాంశం
మొత్తానికి, మీనా నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ మోహన్ బాబు గురించి చెప్పిన విషయాలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక బంధాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.


