|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Yamini Bhaskar: ఇండస్ట్రీలో ఎదవలు ఉన్నారు.. ఇబ్బందులు పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై యామిని షాకింగ్ కామెంట్స్

Published: 10-12-2025, 6:08 AM
Yamini Bhaskar: ఇండస్ట్రీలో ఎదవలు ఉన్నారు.. ఇబ్బందులు పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై యామిని షాకింగ్ కామెంట్స్
  • నటి యామిని భాస్కర్ ‘రభస’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.
  • కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని యామిని వెల్లడించారు.
  • కాస్టింగ్ కౌచ్, మేల్ డామినేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
  • ఆమె కొత్త సినిమా ‘సైక్ సిద్దార్థ’ జనవరి 1న విడుదల కానుంది.

నటి యామిని భాస్కర్ టాలీవుడ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై ఓపెన్ అయ్యారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, మేల్ డామినేషన్ వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

యామిని భాస్కర్ సినీ ప్రస్థానం

Yamini Bhaskar: రభస సినిమాతో టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది యామిని భాస్కర్(Yamini Bhaskar). ఆ తరువాత హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ చాలా సినిమాలే చేసింది. భలే మంచి చౌక బేరము, కొత్తగా మా ప్రయాణం,నర్తనశాల, కాటమరాయుడు వంటి సినిమాల్లో నటించింది. కానీ, అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది. చాలా గ్యాప్ తరువాత యామిని భాస్కర్ చేస్తున్న సినిమా సైక్ సిద్దార్థ. సిద్దు హీరోగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించింది.

Kriti Sanon: హీరోలందరూ పొట్టివాళ్లే.. నాముందు హీల్స్ వేసుకుంటారు.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..

కాస్టింగ్ కౌచ్ పై యామిని సంచలన వ్యాఖ్యలు

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎదవలు ఉన్నారు. నాకు కూడా ఎదురయ్యారు. కెరీర్ మొదట్లో బాగానే ఉంది. కానీ, మధ్యలో కొంతమంది అలా తగిలారు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలియక ఇండస్ట్రీనే వదిలేద్దాం అనుకున్నాను. అందుకే చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు. అందరు కాదు. కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. మేల్ డామినేషన్ చూపిస్తారు. అమ్మాయిలను తక్కువగా చూస్తారు. అవకాశం కోసం ఏదైనా చేస్తారు అనే ఆలోచనలో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు భయమేసేది. ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. దాంతో నాకు యాటిట్యూడ్ అనుకున్నారు.

‘సైక్ సిద్దార్థ’ సినిమాపై అంచనాలు

కేవలం మగవాళ్ళు మాత్రమే ఆలా ఉన్నారని నేను చెప్పను. ఈమధ్య ఆడవాళ్లు కూడా అలానే తయారయ్యారు. అవి తెలిసి నేను షాక్ అయ్యాను. భయపడకుండా అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి”అంటూ చెప్పుకొచ్చింది యామిని భాస్కర్. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చాలా కాలం గ్యాప్ తరువాత యామిని చేస్తున్న ఈ సినిమా ఆమెకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలి.

యామిని భాస్కర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరోసారి కాస్టింగ్ కౌచ్ చర్చకు దారి తీస్తున్నాయి. ఆమె కొత్త సినిమా ‘సైక్ సిద్దార్థ’ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.